
క్రైమ్ మిర్రర్, యదాద్రి భువనగిరి ప్రతినిధి : యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలంలో ప్రేమ జంట ఆత్మహత్య చేసుకుంది. గూడ్స్ రైలు కింద పడి యువతీ యువకులు బలవన్మరణానికి పాల్పడ్డారు. మృతి చెందిన యువతికి మూడేళ్ల కిందట మరో వ్యక్తితో వివాహమైంది. ఆమె భర్త యాదగిరిగుట్టలో లడ్డూ తయారీ విభాగంలో పనిచేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదగిరిగుట్ట మండలం బాహుపేట సమీపంలోని రైల్వే ట్రాక్‌పై బుధవారం ఉదయం యువతీ యువకులు గూడ్స్ రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు.
Read Also : మంత్రి గంగుల కమలాకర్ ఇంట్లో ఐటి, ఈడీ అదికారుల సోదాలు….
రైల్వే సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఘటనాస్థలికి వచ్చిన పోలీసులు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నారు. మృతులు భువనగిరి మండలం బస్వాపూర్ గ్రామానికి చెందిన ఉడుతల గణేశ్ (25), అదే గ్రామానికి చెందిన నలంద (23)గా గుర్తించారు. నలందను మూడేళ్ల కిందట యాదగిరిగుట్టకు చెందిన యాదగిరికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే, ఆమెకు పెళ్లికి ముందు నుంచే గణేశ్‌తో ప్రేమ వ్యవహారం ఉన్నట్లు తెలుస్తోంది.
Also Read : మునుగోడు రిజల్ట్ చూసి షేకైన కేసీఆర్.. బీజేపీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?
మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో యాదగిరి డ్యూటీ ముగించుకొని గుట్ట నుంచి ఇంటికి తిరిగొచ్చేసరికి ఇంట్లో భార్య కనిపించలేదు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం ఉదయం బాహుపేట సమీపంలో రైల్వే ట్రాక్ వద్ద ఇద్దరి మృతదేహాలు పడి ఉండటాన్ని రైల్వే సిబ్బంది గమనించారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. యాదగిరిగుట్ట పోలీసులు ఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఆస్పత్రికి తరలించారు.
ఇవి కూడా చదవండి :
- ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
- కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై వేటుకు రంగం సిద్దం….పార్టీకి వెన్నుపోటు పొడిచారంటూ నేతల ఆరోపణ
- బిజేపి అభ్యర్డుల జాబితాలో క్రిక్కెటర్ జడేజా భార్య…..
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
2 Comments