
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్‌టాపిక్‌గా మారుతూనే ఉంది. మనుగోడు ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా పోటీలోకి దిగిన తన తమ్ముడికి మద్దతుగా ఆయన ప్రచారం చేసినట్లు బయటపడ్డ ఆడియో, వీడియోలు కాంగ్రెస్ శ్రేణుల్లో కలకలం రేపాయి. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా వెంకటరెడ్డి పనిచేశారని, కాంగ్రెస్‌కు ఆయన వెన్నుపోటు పొడిచారంటూ హస్తం శ్రేణులు ఆరోపిస్తోన్నారు. ఆయనపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర నేతలు ఢిల్లీ అధిష్టానానికి ఇప్పటికే ఫిర్యాదు చేయగా… వెంకటరెడ్డికి ఏఐసీసీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
Also Read : మునుగోడు రిజల్ట్ చూసి షేకైన కేసీఆర్.. బీజేపీ ఆపరేషన్ గ్రాండ్ సక్సెస్?
ఇప్పటివరకు షోకాజ్ నోటీసులకు వెంకటరెడ్డి వివరణ ఇవ్వలేదని తెలుస్తోంది. దీంతో ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసేందుకు రంగం సిద్దం అవుతోన్నట్లు ప్రచారం జరుగుతోంది. షోకాజ్ నోటీసులకు 10 రోజుల్లో సమాధానం ఇవ్వాలని ఆదేశించినా.. తనకు నోటీసులు అందలేదని వెంకటరెడ్డి చెప్పడంతో మరోసారి నోటీసులు పంపారు. కానీ ఇప్పటివరకు వెంకటరెడ్డి ఎలాంటి వివరణ ఇవ్వలేదు. ఆస్ట్రేలియా నుంచి వచ్చిన తర్వాత తెలంగాణలో జరిగిన రాహుల్ భారత్ జోడో పాదయాత్రలో కూడా ఆయన పాల్గొనలేదు. ఒక్క వెంకటరెడ్డి మినహా నేతలందరూ రాహుల్ జోడో పాదయాత్రలో పాల్గొని సక్సెస్ చేసేందుకు తమ వంతు కృషి చేశారు.
Read Also : కూసుకుంట్లకు కర్నె ప్రభాకర్ షాక్.. నారాయణపురంలో బీజేపీకి 269 ఓట్ల లీడ్
షోకాజ్ నోటీసులకు వివరణ ఇవ్వకపోవడం, ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జోడో యాత్రకు డుమ్మా కొట్టడంతో వెంకటరెడ్డిపై వేటు వేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయనే వార్తలు జోరుగా వినిపిస్తోన్నాయి. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడిన వెంకటరెడ్డిపై చర్యలు తీసుకోవాలంటూ రాష్ట్ర నేతలు ఏఐసీసీని కోరుతున్నారు. ఇటీవల కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ కూడా కోమటిరెడ్డి తీరుపై స్పందించారు. షోకాజ్ నోటీసులకు సమాధానం ఇవ్వకపోతే అధిష్టానం తదుపరి చర్యలు తీసుకుంటుందని, క్రమశిక్షణ పాటించకుండా గీత దాటితే చర్యలు తప్పవని జైరాం రమేష్ హెచ్చరించారు.
Also Read : చౌటుప్పల్ మండలంలో హోరీహోరీ.. ముగ్గురు మంత్రులకు షాక్…
దీంతో వెంకటరెడ్డిని పార్టీ నుంచి సస్పెండ్ చేయడం ఖాయమనే ఊహాగానాలు వినిపిస్తోన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు ఇండా ఏడాదిన్నర సమయం ఉన్న క్రమంలో వెంకటరెడ్డిపై కాంగ్రెస్ అధిష్టానం వేటు వేసే సాహసం చేస్తుందా..? లేదా? అనేది తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. కాగా కాంగ్రెస్ పార్టీకి స్టార్ క్యాంపెయిన్‌గా ఉన్న వెంకటరెడ్డి మునుగోడు ఉపఎన్నికలో సొంత పార్టీ తరపున ప్రచారం చేయకుండా ఆస్ట్రేలియా టూర్‌కి వెళ్లిపోయారు. ఈ నెల 1వ తేదీన ఆస్ట్రేలియా నుంచి తిరిగొచ్చిన తర్వాత ఆయన సైలెంట్‌గా ఉన్నారు. రాహుల్ జోడో యాత్రలో కూడా పాల్గొనకుండా దూరంగా ఉన్నారు.
- ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
- బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ ఇచ్చిన హామీ ఇదే?

3 Comments