
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నికల కౌంటింగ్ లో ఊహించని ఫలితాలు వస్తున్నాయి. టీఆర్ఎస్ బలంగా ఉందని భావించిన సంస్థాన్ నారాయణపురం మండలంలో బీజేపీ తీవ్రమైన పోటీ ఇచ్చింది. నారాయణపురంలో బీజేపీ లీడ్ సాధించింది. ప్రభుత్వ మాజీ విప్ కర్నె ప్రభాకర్ సొంతూరు సంస్థాన్ నారాయణపురం. ఇక్కడ మంత్రి గంగుల కమలాకర్ ఎన్నికల ఇంచార్జుగా ఉన్నారు. అయితే ఓట్ల లెక్కింపులో మాత్రం బీజేపీకి లీడ్ వచ్చింది.
నారాయణపురంలో ఏడు పోలింగ్ కేంద్రాలు ఉండగా.. ఓవరాల్ గా బీజేపీకి 269 ఓట్ల లీడ్ వచ్చింది. సంస్థాన్ నారాయణపురంలో బీజేపీకి 2374 ఓట్లు రాగా టీఆర్ఎస్ కు 2105 ఓట్లు వచ్చాయి. కాంగ్రెస్ కు 784 ఓట్లు పోలయ్యాయి. దీంతో నారాయణపురంలో కర్నె ప్రభాకర్ వర్గం కూసుకుంట్లకు హ్యాండిచ్చి.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సపోర్ట్ చేసిందనే ప్రచారం సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- చౌటుప్పల్ మండలంలో హోరీహోరీ.. ముగ్గురు మంత్రులకు షాక్…
- ఓటర్లకు ఇవ్వాల్సిన కోట్లాది రూపాయలు స్వాహా! రాజన్నను ముంచేసిన మర్రిగూడెం బీజేపీ నేతలు!
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి.. కేసీఆర్ కోవర్టా?