
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో కాక రాజేసిన మునుగోడు ఉప ఎన్నిక ముగిసింది. రికార్డు స్థాయిలో 93.5 శాతం పోలింగ్ నమోదైంది. ఎక్కడైనా పోలింగ్ ముగియగానే ఏ పార్టీకి ఎన్ని ఓట్లు వస్తాయి.. ఎవరు గెలుస్తరు అన్న దానిపై చర్చ జరుగుతుంది. కాని మునుగోడులో మాత్రం డబ్బుల పంపకాల గురించి రచ్చ సాగుతోంది. పోలింగ్ ముగిసినా డబ్బులపైనే చర్చ నడుస్తోంది. ముఖ్యంగా మర్రిగూడెం మండలంలో చర్చ ఎక్కువగా ఉంది. మర్రిగూడెం మండలంలో బీజేపీ నేతలు ఓటర్లకు పూర్థి స్థాయిలో డబ్బులు పంచడంలో విఫలమయ్యారు.
కారు పార్టీ నేతలు మండలంలోని ఓటర్లందరికి నాలుగు వేల చొప్పున పంపిణి చేశారు. దీంతో ఓటర్లు అంతే లేదా అంతకంటే ఎక్కువ మనీ బీజేపీ అబ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇస్తారని అశించారు. ఎదురుచూశారు. కాని పోలింగ్ రోజున వాళ్లకు నిరాశ కలిగింది. సాయంంత్రం వరకు చూసినా మెజార్టీ ఓటర్లకు బీజేపీ డబ్బులు అందలేదు. కొందరు ఓటర్లు రోడ్డెక్కి నిరసన కూడా తెలిపారు. డబ్బులు పంచకపోవడంతో మర్రిగూడెం మండలంలో కోమటిరెడ్డికి నష్టం చేసిందనే టాక్ వస్తోంది.
Read More : విద్యార్థులకు కుళ్లిపోయిన భోజనం.. సమైక్యత వేడుకల్లో దారుణం
డబ్బుల పంపకంలో పక్కాగా ఉండే కోమటిరెడ్డి… అత్యంత కీలకమైన ఉప ఎన్నికలో ఎందుకు ఓటర్లకు డబ్బులు పంచలేదన్నది చర్చగా మారింది. అయితే ఇందుకు స్థానిక బీజేపీ నేతలే కారణమని తెలుస్తోంది. శివన్నగూడెంకు సంబందించి సంచలన విషయాలు బయటికి వస్తున్నాయి. శివన్నగూడెంలో 26 వందల ఓటర్లు ఉన్నారు. దీంతో ఓటర్లందరికి తలా 3 వేలు ఇచ్చేలా 80 లక్షల రూపాయలు పంపించారట కోమటిరెడ్డి. అయితే స్థానిక నేతలు మాత్రం సగం మందికి పంచేసి వెళ్లిపోయారు. పోలింగ్ రోజున డబ్బులు రానివారంతా నిరసనకు దిగడంతో కోమటిరెడ్డికి విషయం తెలిసిందట.
ఏమైందని తెలుసుకుంటే.. ఇచ్చిన 80 లక్లల్లో సగం పంచేసి.. మిగితా 40 లక్లల రూపాయలు స్థానిక నేతలు మాయం చేశారని తెలిసిందట. దీనిపై శివన్నగూడెం నేతలను ప్రశ్నిస్తే.. తమకు కేవలం 40 లక్షల రూపాయలే వచ్చాయని,.. అన్ని పంచేశామని చెప్పారట. డబ్బుల పంపిణి చేసిన నేతలు మాత్రం తాము శివన్నగూడెంకు 80 లక్షల రూపాయలు పంపించామని తేల్చి చెప్పారట. దీంతో మాయమైన 40 లక్షలు ఎవరూ జేబుల్లోకి వెళ్లిందన్న దానిపై బీజేపీ నేతల మద్య గొడవ జరుగుతుందని తెలుస్తోంది.
Read More : వ్యభిచారం చేస్తూ హోటల్లో అడ్డంగా బుక్కైన తెలుగు స్టార్ హీరోయిన్..
పోలింగ్ రోజునే గొడవ జరిగిందని తెలుస్తోంది. శుక్రవారం కూడా డబ్బుల విషయంలో గొడవ జరిగిందని.. నేతలు రెండు వర్గాలుగా విడిపోయి వాగ్వాదానికి దిగారని సమాచారం. డబ్బుల విషయంలో ఇంచార్జుగా ఉన్న లీడర్లను పార్టీ కేడర్ నిలదీసిందని తెలుస్తోంది. నేతల కక్కుర్తితో రాజగోపాల్ రెడ్డికి మోసం జరిగిందని బీజేపీ కార్యకర్తలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా లీడ్ వస్తుందనుకున్న శివన్నగూడెంలో నేతల తీరుతో వెనకబడి పోయామని వాపోతున్నారు.
అసలు 40 లక్షల రూపాయలు ఏం చేశారన్నది తెలియడం లేదని అంటున్నారు. ఇలాంటి గటనలు చాలా గ్రామాల్లో జరిగాయని ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయి, బీజేపీలోని పాత నేతలు, కొత్త నేతల మద్య గ్యాప్ ఉండటం కూడా ఇందుకు కారణమైందని తెలుస్తోంది. కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు .. చేరిక సమయంలో కొంత మనీకి డీల్ చేసుకున్నారనే వార్తలు వచ్చాయి. అయితే చెప్పిన ప్రకారం సదరు నేతలకు మనీ అందలేదని తెలుస్తోంది. దీంతో అలాంటి నేతలంతా ఇదే అదనగా ఓటర్లకు పంచాల్సిన డబ్బులను అందినకాడికి నొక్కేశారనే ప్రచారం సాగుతోంది.
Read More : బెంగళూరు ఎయిర్‌పోర్టులో రూ.9.8 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
మరోవైపు శివన్నగూడెం ఓటర్లు మాత్రం డబ్బులు కొట్టేసిన బీజేపీ నేతలను దారుణంగా తిడుతున్నారు. తమకు రావాల్సిన డబ్బులను నొక్కేశారంటూ శాపనార్థాలు పెడుతున్నారు. మొత్తంగా ఓటర్లకు పంచాల్సిన డబ్బులను కొందరు లీడర్లు స్వాహా చేయడం మర్రిగూడెం మండలంలో కలకలం రేపుతోంది. డబ్బులను ఓటర్లను పంచని లీడర్లపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మండిపడ్డారని తెలుస్తోంది. మొత్తంగా బీజేపీ నేతల కక్కుర్తితో రాజగోపాల్ రెడ్డికి తీరని నష్టం జరిగిపోయింది.
ఇవి కూడా చదవండి …
4 Comments