
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉప ఎన్నికలో సంచలన పరిణామాలు జరుగుతున్నాయి. మరో ఐదు రోజుల్లో పోలింగ్ జరగనుండగా రాజకీయ సమీకరణలు మారిపోయినట్లు కనిపిస్తోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి బీజేపీలో చేరడంతో నియోజకవర్గంలో కమలం పార్టీ జోష్ కనిపించింది. టీఅర్ఎస్ లో అసమ్మతి భగ్గుమనడంతో కోమటిరెడ్డికి పెద్దగా పోటీ ఉండదనే ప్రచారం సాగింది. కాంగ్రెస్, టీఆర్ఎస్ నుంచి భారీగా నేతలు కమలం గూటికి చేరడంతో కోమటిరెడ్డి గ్రాఫ్ పెరిగిపోయింది. నేతలంతా వలస పోవడంతో కాంగ్రెస్ కేడర్ డీలా పడగా.. అధికార పార్టీలో అసమ్మతి ఇబ్బందిగా మారింది. దీంతో ఉప ఎన్నికలో కోమటిరెడ్డి విజయం ఖాయమనే అంతా భావించారు. కాని రోజులు గడుస్తున్న కొద్ది బలాబలాలు మారిపోయాయి. వారం రోజుల క్రితం వరకు బీజేపీ కారు పార్టీకి గట్టి పోటీ ఇచ్చినట్లు కనిపించింది. కాని ప్రస్తుతం మాత్రం సీన్ మారిపోయిందనే చర్చ సాగుతోంది. టీఆర్ఎస్ దూసుకుపోగా.. కమలం పార్టీ చతికిలపడినట్లు కనిపిస్తోంది. అటు కాంగ్రెస్ మాత్రం గత వారం రోజుల్లో కాస్త బలపడినట్లు కనిపిస్తోంది.
గత వారం రోజులుగా నియోజకవర్గంలో పార్టీల ప్రచార సరళీని పరిశీలించిన వారు.. కమలం పార్టీలో జోష్ తగ్గిందని చెబుతున్నారు. తాజాగా బీజేపీ జాతీయ అద్యక్షుడు జేపీ నడ్డా మునుగోడు బహిరంగ సభ రద్దు కావడం కమలం పార్టీలో కలకలం రేపుతోంది. అదివారం చండూరులో సీఎం కేసీర్ బహిరంగ సభ నిర్వహిస్తున్నారు. సీఎం సభ కోసం ప్రతి ఎంపీటీసీ పరిధి నుంచి వెయ్యి మందిని తరలించేలా గులాబీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఇలాంటి సమయంలో కేఆసీర్ సభకు ధీటుగా మునుగోడులో బీజేపీ సభ ఉంటుందని అనుకున్నారు. జేపీ నడ్డా సభను భారీగా నిర్వహిస్తారని అనుకున్నారు. కాని నడ్డా టూర్ రద్దు కావడంతో కొత్త చర్చలు జరుగుతున్నాయి. తాజాగా నిర్వహించిన సర్వేల్లో పరిస్థితి దారుణంగా ఉండటంతో నడ్డా సభ క్యాన్సిల్ అయిందంటున్నారు. ఓటమి ఖాయమని తేలడంతో నడ్డా తన టూర్ ను రద్దు చేసుకున్నారనే ప్రచారం రాజకీయ వర్గాలతో పాటు మునుగోడు జనాల్లో సాగుతోంది.
Read More : రాజగోపాల్ రెడ్డిపై దాడుల వెనుక ఎవరున్నారు?
జేపీ నడ్డా సభ రద్దు విషయం మునుగోడు కమలనాథులను పరేషాన్ చేస్తోంది. సభ రద్దు కావడంతో జనంలోకి రాంగ్ మెసేజ్ వెళుతుందని.. ఓటమి ఖాయమని తేలడం వల్లే నడ్డా రావడం లేదనే చర్చ జనాల్లో సాగుతుందని బీజేపీ నేతలు కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రచారం జనంలోకి వెళితే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని అంటున్నారు. ఇప్పటికే కోమటిరెడ్డి చేతులెత్తేశారనే ప్రచారం సాగుతుందని.. ఇప్పుడు నడ్డా సభ క్యాన్సిల్ అయితే అదే నిజమేనని జనం నమ్మే అవకాశం ఉందంటున్నారు. అయినా ముందు షెడ్యూల్ ఇచ్చి ఇప్పుడు సభను రద్దు చేయడం ఏంటని మరికొందరు కమలం నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నడ్డా పర్యటన రద్దు అంశం మునుగోడులో తీవ్ర ప్రభావం చూపనుందని, పార్టీకి పడాల్సిన ఓట్లకు భారీగా గండి పడవచ్చనే అభిప్రాయం కొందరు బీజేపీ నేతల నుంచి వస్తోంది. గత వారం రోజుల్లో కాంగ్రెస్ బలపడిందని.. కోమటిరెడ్డి డల్ అయ్యారనే విషయం తెలిస్తే కాంగ్రెస్ నుంచి వచ్చిన నేతలు తిరిగి సొంత గూటికి వెళ్లే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇప్పటికే కొన్ని గ్రామాల్లో ఇది జరుగుతుందని తెలుస్తోంది.
Read More : తెలంగాణ ఆప్ చీఫ్ గా కోదండరామ్?
మరోవైపు జేపీ నడ్డా పర్యటన రద్దుపై మరో చర్చ కూడా సాగుతోంది. మూడు రోజుల క్రితం వెలుగులోనికి వచ్చిన ఎమ్మెల్యే కొనుగోలు అంశం తెలంగాణలో కాక రేపుతోంది. మొదట బీజేపీ నేతలు బుకాయించినా.. అడియోలు బయటికి వచ్చాకా కొంత డిఫెన్స్ పడ్డారని తెలుస్తోంది. అడియోలో బీజేపీ ముఖ్య నేతల పేర్లు రావడం బీజేపీ పెద్దలను కలవరానికి గురి చేసిందని అంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో జేపీ నడ్డా తెలంగాణకు వస్తే.. ఎమ్మెల్యేల బేరసారాల విషయంలో స్పందించాల్సి ఉంటుంది. అందుకే ఈ విషయంలో ఏం మాట్లాడాలో తెలియకే నడ్డా తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారనే చర్చ పొలిటికల్ సర్కిళ్లలో జరుగుతోంది. మొత్తంగా జేపీ నడ్డా మునుగోడు సభ రద్దు బీజేపీలో నిరాశ నింపగా.. కారు పార్టీలో మాత్రం జోష్ నింపుతోంది. గత వారం రోజులుగా జరుగుతున్న పరిణామాలతో మునుగోడులో బీజేపీ హ్యాండ్సప్ అయిందనే వాదన ఎక్కువగా వినిపిస్తోంది.
ఇవి కూడా చదవండి …
- పేరుకే లైసెన్సు రద్దు… కానీ అంతా ఆయన కనుసన్నల్లోనే… ఆయన చెప్పాడంటే అనుమ
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- బీజేపీ గూటికి టీఆర్ఎస్ ఎంపీ! కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్
- స్వామి గౌడ్, దాసోజులు బీజేపీ కోవర్టులా? కమలం నేతలే కారెక్కించారా?
- కార్యకర్తలే తమ బలం….బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు