
క్రైమ్ మిర్రర్, నల్గొండ జిల్లా నిఘా : మునుగోడు ఉప ఎన్నికల పోలింగ్ సమీపిస్తున్న కొద్ది రాజకీయాలు హాట్ హాట్ గా మారుతున్నాయి. గెలుపే లక్ష్యంగా పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇందులో భాగంగానే కూసుకుంచ్ల ప్రభాకర్ రెడ్డి పీఏ ఉపేందర్ పై పలు ఆరోపణలు వచ్చాయి. తనపై వస్తున్న వార్తలను ఖండించారు కూసుకుంట్ల పీఏ ఉపేందర్. ఉప ఎన్నికల్లో లబ్ది కోసమే తనపై కుట్రలు చేస్తున్నారని అన్నారు. తమ నాయకుడు కూసుకుంట్ల విజయం ఖాయం కావడంతో.. బీజేపీ ఇలాంటి చిల్లర కుట్రలకు తెర తీసిందని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో తాను బిజీగా ఉంటే… అడ్డగోలుగా ప్రచారం చేయడం సరికాదని అన్నారు.
Read More : మాజీ సైనికునికి కూడా పంగనామాలా ?
మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి డబ్బుల వ్యవహారం మొత్తం పార్టీనే చూసుకుంటుందని ఉపేందర్ చెప్పారు. నియోజకవర్గాన్ని 86 క్లస్టర్లుగా విభజించి… ఒక్కో ఎంపీటీసీ పరిధికి మంత్రి, ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీని ఇంచార్జుగా నియమించారని తెలిపారు. పార్టీ హైకమాండ్ నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారం ఇంచార్జులు పని చేస్తున్నారని వెల్లడించారు. ఖర్చులు కూడా వాళ్లే చూసుకుంటున్నారని ఉపేందర్ చెప్పారు. ప్రచారం కోసం పార్టీ నుంచి వస్తున్న ఫండ్ కూడా నేరుగా ఇంచార్జులకే వెళుతుందన్నారు. ఇదంతా పార్టీ పెద్దల డైరెక్షన్ లోనే సాగుతుందని.. ఇక తన ప్రమేయం ఎక్కడ ఉంటుందని ఉపేందర్ ఆవేదన వ్యక్తం చేశారు. తనకు సంబంధం లేని విషయంలో కావాలనే తనను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారని అన్నారు. తనను ముందుంచి కూసుకుంట్లను ఇబ్బంది పెట్టేలా విపక్షాలు కుట్రలు చేస్తున్నాయని అరోపించారు ఉపేందర్.
Read More : ఇవేమి (కారు) రాతలు?… ప్రజల్లో భయాందోళనలకా?
ఉప ఎన్నికలో తాను పూర్తిగా కూసుకుంట్ల ప్రచార కార్యక్రమాలు చూడటంపైనే నిమగ్నం అయ్యాయని చెప్పారు. రోజు వారి ప్రచార షెడ్యూల్, రోడుషోలకు సంబంధించిన ఏర్పాట్లను చూస్తున్నానని చెప్పారు. రోజువారిగా కూసుకుంట్ల నిర్వహిస్తున్న ర్యాలీల ఏర్పాట్లకు సంబంధించి మాత్రం ఆయా గ్రామాల నేతలతో తాను కో ఆర్టీనేట్ చేస్తున్నానని చెప్పారు. ప్రచారం తప్పించి ఇంకా ఏ విషయాలపైనా తాను పార్టీ నేతలతో మాట్లాడటం లేదని చెప్పారు. ఇంచార్జులుగా ఉన్న మంత్రులు, ఎంపీలు,ఎమ్మెల్సీ, ఎమ్మెల్సీలే అన్ని చూసుకుంటున్నారని కూసుకుంట్ల పీఏ వెల్లడించారు. ఓటమి ఖాయమని గ్రహించిన బీజేపీ, కాంగ్రెస్ నేతలు.. టీఆర్ఎస్ నేతలను రెచ్చగొట్టేలా తనపై తప్పుడు ప్పచారం చేస్తున్నారని ఉపేందర్ మండిపడ్డారు. తాను కూసుకుంట్లకు నమ్మకంగా పని చేస్తున్నానని చెప్పిన ఉపేందర్.. అత్యంత కీలకమైన ఉప ఎన్నికలో పార్టీకి ఇబ్బంది కల్గించేలా ఎందుకు వ్యవహరిస్తానని అన్నారు. తనపై జరుగుతున్న ప్రచారం అంతా అవాస్తవమన్నారు కూసుకుంట్ల పీఏ ఉపేందర్.
ఇవి కూడా చదవండి …
- రాజగోపాల్ రెడ్డిపై దాడుల వెనుక ఎవరున్నారు?
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- బీజేపీ గూటికి టీఆర్ఎస్ ఎంపీ! కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్
- సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
- కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
One Comment