
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : మునుగోడు ఉపఎన్నికలో పోలింగ్ తేది సమీపిస్తున్న కొలది పార్టీల బలాబలాలు మారుతున్నాయి. మునుగోడులో గెలుపు కోసం ప్రధాన పార్టీలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. బీజేపీ అభ్యర్థిగా ఉప ఎన్నికలో పోటీ చేస్తున్నారు. కాంగ్రెస్ క్యాండిడేట్ గా మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు స్రవంతి రెడ్డి బరిలో ఉన్నారు. అయితే కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన రాజగోపాల్ రెడ్డి.. తనతో పాటు హస్తం పార్టీ లీడర్లు, కేడర్ ను తీసుకువెళ్లారు. మునుగోడు నియోజకవర్గంలో ఏడు మండలాలు ఉండగా.. అన్ని మండలాలకు చెందిన మెజార్టీ కాంగ్రెస్ నేతలు రాజగోపాల్ రెడ్డితో పాటు కాషాయ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ నుంచి గెలిచిన స్థానిక ప్రతినిధులు సైతం ఎవరి దారి వారు చూసుకున్నారు. మెజార్టీ కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు బీజేపీలో చేరగా.. కొందరు అధికార పార్టీలో చేరారు. నేతల వలసలతో నియోజకవర్గంలో కాంగ్రెస్ బలహీనపడింది. ఆ ప్రభావం ఉప ఎన్నిక ప్రచారంలో కనిపిస్తోంది.
Read More : సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
మునుగోడులో ఎలాగైనా గెలిచేందుకు అధికార టీఆర్ఎస్, బీజేపీలో వ్యూహాలు రచిస్తున్నాయి. ఆ రెండు పార్టీల కీలక నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. టీఆర్ఎస్ పార్టీ ప్రచారంలో 14 మంది మంత్రులు, 76 మంది ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు పాల్గొంటున్నారు.కాంగ్రెస్ లో మాత్రం అలాంటి సీన్లు కనిపించడం లేదు. ఇంచార్జులను నియమించినా ఒకరిద్దరు తప్ప మిగితా వారు సీరియస్ గా పని చేయడం లేదు. ఏదో వచ్చామంటే వచ్చామన్నట్లుగా ప్రచారం చేసి వెళుతున్నారు. దీంతో టీఆర్ఎస్, బీజేపీకి ధీటుగా ప్రచారం చేయలేక కాంగ్రెస్ పార్టీ వెనుకబడి పోయినట్లు కనిపించింది. ఆర్థికంగానూ ఆ రెండు పార్టీలకు పోటీ పడే పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్ కు మైనస్ గా మారింది. అయితే గతంలో నిస్తేజంగా సాగిన కాంగ్రెస్ ప్రచారం.. గత నాలుగైదు రోజులుగా జోరందుకుంది. కాంగ్రెస్ కేడర్ లోనూ కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని అడ్డుకుంటూ హల్చల్ చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు. కాంగ్రెస్ పార్టీకి మోసం చేసిన రాజగోపాల్ గో బ్యాక్ అంటూ నినాదాలు చేస్తున్నారు.ప్రతి రోజు ఏదో ఒక చోట రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ కార్యకర్తలు.
Read More : రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
రాజగోపాల్ రెడ్డిని అడుగడుగునా అడ్డుకోవడంతో పాటు స్రవంతి ప్రచారంలోనూ దూకుడు పెరిగింది. దీంతో కాంగ్రెస్ కేడర్ లో ఒక్కసారిగా జోష్ పెరగడానికి కారణం ఏంటన్న చర్చ సాగుతోంది. ఇందుకు కారణం ఎన్నికల వ్యూహకర్త సునీల్ టీమ్ అని తెలుస్తోంది. రాష్ట్రంలో టీఆర్ఎస్ ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసిన పీకే… ఇటీవలే తప్పుకున్నారు. సునీల్ గతంలో ప్రశాంతి కిషోర్ టీమ్ లో పని చేశారు. ఇప్పుడు మునుగోడులో కాంగ్రెస్ కోసం ఆయన టీమ్ పని చేస్తోంది. ఆ సంస్థ ప్రతినిధులు ఇప్పటికే నియోజకవర్గంలో సర్వేను పూర్తిచేయడంతోపాటు పాల్వాయి స్రవంతికి అవసరమైన సమాచారన్ని సేకరిస్తున్నారని అంటున్నారు. సునీల్ టీమ్ వ్యూహంలో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని కాంగ్రెస్ కార్యకర్తలు ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారనే టాక్ వస్తోంది. ఎన్నికల వ్యూహాలు రచించడంలో పీకే టీమ్ మెంబర్స్ దిట్ట. బెంగాల్ ఎన్నికల్లోనూ ఇలాంటి ఘటనలే జరిగాయి. ఇప్పుడు మునుగోడులోనూ అలాంటి సీన్లే కనిపిస్తున్నాయి. దీంతో పక్కా ప్లాన్ లో భాగంగానే కాంగ్రెస్ కార్యకర్తలు రాజగోపాల్ రెడ్డిని అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని అంటున్నారు. వరుసగా జరుగుతున్న పరిణామాలతో మునుగోడులో రానున్న రోజుల్లో మరిన్ని కీలక పరిణామాలు జరుగుతాయనే చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!
- బీజేపీ గూటికి టీఆర్ఎస్ ఎంపీ! కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్
- స్వామి గౌడ్, దాసోజులు బీజేపీ కోవర్టులా? కమలం నేతలే కారెక్కించారా?
- కార్యకర్తలే తమ బలం….బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
- కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
2 Comments