క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య నందిత అకాల మరణం పట్ల పలువురు నేతలు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మృతి దిగ్ర్బాంతికి గురి చేసిందని అంటున్నారు. ఆమె కుంటుంబ సభ్యులకు సీఎం రేవంత్, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ‘కంటోన్మెంట్ శాసన సభ్యురాలు లాస్య నందిత అకాలమరణం నన్ను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. నందిత తండ్రి స్వర్గీయ సాయన్న గారితో నాకు సన్నిహిత సంబంధం ఉండేది. ఆయన గత ఏడాది ఇదే నెలలో స్వర్గస్తులవడం.. ఇదే నెలలో నందిత కూడా ఆకస్మికంగా మరణం చెందడం అత్యంత విషాదకరం. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలుపుతూ.. ఆమె ఆత్మకు శాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నాను.’ అని సీఎం రేవంత్ ట్విట్టర్ వేదికగా విచారం వ్యక్తం చేశారు.
Read Also : ఎమ్మెల్యేగా గెలిచాక లాస్యకు వరుసగా ప్రమాదాలు.. వెంటాడిన మృత్యువు..
లాస్య నందిత మృతిపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విచారం వ్యక్తం చేశారు. లాస్య మృతికి సంతాపం తెలిపిన కేసీఆర్.. అకాల మరణం బాధాకరమన్నారు. ఆమె కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు. కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా ఆమె మృతిపట్ల విచారం వ్యక్తం చేశారు. వారం క్రితమే లాస్య నందితను కలిసినట్లు వెల్లడించారు. పది రోజుల క్రితం నల్గొండ రోడ్డు ప్రమాదంలో ఆమె స్వల్పంగా గాయపడగా.. ఇంటికి వెళ్లి పరామర్శించిన ఫోటోలను కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘లాస్య నందిత ఇక లేరు అనే విషయం అత్యంత విషాదకరమైన, షాకింగ్‌కు గురి చేసేది. యువ ఎమ్మెల్యేను కోల్పోవటం చాలా బాధాకరం. ఈ క్లిష్ట సమయంలో ఆమె కుటుంబానికి బలం చేకూర్చాలని ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నా.’ అని కేటీఆర్ ట్విట్టర్లో పేర్కొన్నారు. లాస్య నందిత మృతిపై కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చిన్న వయస్సులోనే లాస్య నందిత మరణించడం బాధాకరమన్నారు. లాస్య ఆత్మకు శాంతి కలగాలి, ఆమె కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు వెల్లడించారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ మంత్రి హరీష్ రావు తదితరులు సైతం ఆమె మృతిపై విచారం వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- ఆదివాసీల ఆశలపై నీళ్లు చల్లిన కేంద్రం.. మేడారం జాతరపై కీలక వ్యాఖ్యలు చేసిన కిషన్ రెడ్డి
- తెలంగాణ కానిస్టేబుళ్ల శిక్షణకు 30 శాతం అభ్యర్ధులు డుమ్మా.. తలలు పట్టుకున్న పోలీస్ శాఖ!!
- అమెరికాలో తెలుగు విద్యార్థిని జాహ్నవి కేసులో దోషులను శిక్షించాల్సిందే.. కేటీఆర్ ట్వీట్!
- తాగుడు ఎంత పని చేసింది.. గదిలో ఉండగానే ఇల్లు కూల్చివేత.. వ్యక్తి మృతి
- దోస్త్ మేరా దోస్త్.. సీఎం రేవంత్ రెడ్డిపై ఉత్తమ్, కోమటిరెడ్డి ప్రశంసల జల్లు.. కారణం ఏంటి..?
2 Comments