NalgondaTelangana

మర్రిగూడలో మాయమౌతున్న ప్రభుత్వ భూములు.. బై ఎలక్షన్ లో రెవెన్యూ నిర్లక్ష్యం…!

నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): జిల్లాలోని మర్రిగూడ మండలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం అంతా ఇంతా కాదని చెప్పుకోవచ్చు, ప్రజల దృష్టిలో అది కార్యాలయం అయినా చుట్టం చూపుగా డోలుపుకు పోవటం ఇక్కడి సంప్రదాయం అంటున్నారు మండల ప్రజలు. గతంలో మర్రిగూడ మండలానికి అవినీతిలో గట్టి చరిత్రే ఉన్నప్పటికి కొద్ది రోజుల క్రితం అంతం అయ్యింది అనుకున్నారు ప్రజలు. కానీ అవేమి లెక్కచెయ్యకుండా యధావిధిగా నడుస్తున్నాయి ప్రభుత్వ భూ కబ్జాలు. ప్రస్తుతం ఉన్న అధికారులు కూడా ఈ బై ఎలక్షన్ ల కోసమే విధులు నిర్వహిస్తున్నట్లు ప్రవర్తిస్తూ, ఏ సమస్యలను కూడా పట్టించుకోవటం లేదనే ఆరోపణలు గట్టిగానే వినబడుతున్నాయి.

Read More : మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు….. ఈటల రాజేందర్

గుప్త ఉన్నోడిదే బర్రె అనే విధంగా మండలంలో వ్యవస్థ నడుస్తుందని, కండ్ల ముందే ఏమి జరుగుతున్నా ఏ అధికారి కూడా పట్టించుకోవటం లేదని ప్రజలు భావిస్తున్నారు. జరుగుతున్న అన్యాయం మీద ఏ రాజకీయ నాయకుడు ప్రశ్నిద్దాం అనుకున్నా, ఎలక్షన్ కోడ్ వల్ల ఏమి చెయ్యలేని పరిస్థితి నెలకొంది, సాదారణ సమయంలో సమయానికి కార్యాలయానికి రాని అధికారులు సైతం బై ఎలక్షన్ పుణ్యమా అని ఇక్కడే బిస్తరేసుకొని ఉంటున్నారు.

మర్రిగూడ మండల కేంద్రంలో రెండు సర్వే నెంబర్ లలో 3.425 ఎకరాల ప్రభుత్వ భూమిని యాద్దేచ్చగా కబ్జా చేశారు. మారుమూల గ్రామం అనుకుంటే అధికారులకు సమాచారం తెలియదు అనుకోవచ్చు, కానీ మండల కేంద్రంలోనే జరిగిన ఈ దుస్సాహసానికి అధికారుల అండ కూడా ఉండి ఉండవచ్చనే అనుమానాలు ప్రజల్లో వ్యక్తం అవుతున్నాయి….? ఈ బై ఎలక్షన్ లో ఏది చేసినా చట్టభద్ధమే అని అని ప్రజలు అనుకుంటున్నారా…? లేదా అధికారుల పని విధానం అలా ఉందా అనేది మర్రిగూడ చౌరస్తాలో చర్చ జరుగుతుంది…. ఇక కబ్జా చేసిన వారు ఎవరనేది తెలియాల్సి ఉంది.

Read More : సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?

కొసమెరుపు: గతంలో రెవెన్యూ కార్యాలయం నందు ఆపరేటర్ గా పని చేసిన వ్యక్తి ద్వారానే ఈ ప్రభుత్వ భూముల రహస్యాలు బయటికి పొక్కి భూ కబ్జాలు జరుగుతున్నాయనే గుసగుసలు వినపడుతున్నాయి… మర్రిగూడ రెవెన్యూ కనుసన్నలో జరుగుతున్న మరిన్ని భూ కబ్జాల గురించి మరో కథనంలో మీ ముందుకు.

నిఘా వ్యవస్థ నిద్రిస్తే క్రైమ్ మిర్రర్ కాపు కాస్తుంది.

ad 728x120 SRI swami - Crime Mirror

ఇవి కూడా చదవండి …

  1. బీజేపీ గూటికి టీఆర్ఎస్‌ ఎంపీ! కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్
  2. స్వామి గౌడ్, దాసోజులు బీజేపీ కోవర్టులా? కమలం నేతలే కారెక్కించారా?
  3. కార్యకర్తలే తమ బలం….బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
  4. కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
  5. ఎమ్మెల్యే గారు మీకు ఇది తగునా? ప్రైవేట్ ఇనిస్ట్యూట్ శిక్షణకు వీఎం హోమ్ గ్రౌండ్ ఎందుకివ్వాలి??

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.