
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో వలసల సీజన్ నడుస్తోంది. కొంత కాలంగా తర్వాత మళ్లీ ఆపరేషన్ ఆకర్శ్ కు తెర తీశారు సీఎం కేసీఆర్. మునుగోడు ఉప ఎన్నికల వేళ ఉద్యమకారులను తిరిగి సొంత గూటికి రప్పిస్తున్నారు. మునుగోడు నుంచి టీఆర్ఎస్ టికెట్ ఆశించిన మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కమలం గూటికి చేరిన వెంటనే అప్రమత్తమైన కేసీఆర్ వలసలకు తెర లేపారు. ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద బిక్షమయ్య గౌడ్, శాసనమండలి చైర్మెన్ స్వామిగౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ గులాబీ గూటికి చేరారు. త్వరలో మరికొందరు నేతలు టీఆర్ఎస్ లో చేరనున్నారనే ప్రచారం సాగుతోంది. గతంలో తెలంగాణ ఉద్యమంలో, టీఆర్ఎస్ కీలకంగా వ్యవహరించి .. ప్రస్తుతం ఇతర పార్టీల్లో ఉన్న నేతలతో సీఎం కేసీఆర్ స్వయంగా మాట్లాడుతున్నారని చెబుతున్నారు. మునుగోడు ఉప ఎన్నిక పోలింగ్ సమయానికి చేరికలు జోరందుకుంటాయని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి.
Read More : బీజేపీ గూటికి టీఆర్ఎస్ ఎంపీ! కేసీఆర్ ఆపరేషన్ ఆకర్ష్ కు కమలం కౌంటర్
టీఆర్ఎస్ ఆపరేషన్ ఆకర్ష్ కమలం పార్టీని పరేషాన్ చేస్తోంది. దీంతో కారు పార్టీకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నాల్లో బీజేపీ నేతలు ఉన్నారని సమాచారం. అధికార పార్టీలో అసంతృప్తిగా ఉన్న నేతలను గుర్తించి వాళ్లతో బీజేపీ ముఖ్య నేతలు చర్చలు జరుపుతున్నారని అంటున్నారు. త్వరలోనే కొందరు కీలక నేతలకు కాషాయ కండువా కప్పడం ఖాయమంటున్నారు. శనివారం మునుగోడులో మీడియాతో మాట్లాడిన బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు వలసలపై కీలక వ్యాఖ్యలు చేశారు. టిఆర్ఎస్ ఎమ్మెల్యేలు అందరూ తమతో టచ్ లో ఉన్నారన్నారు. ఇనుము వేడిలో ఉన్నప్పుడే వంచాలన్న ఉద్దేశంతో వాళ్లంతా ఎదురు చూస్తున్నారని చెప్పారు. కండువా కప్పి మీ పక్కన కూర్చోబెట్టుకొంగనే మీ వాళ్ళు అనుకుంటున్నారేమో కానీ మేమె మీవద్దకు పంపి ఉండవచ్చు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు రఘునందన్ రావు.
Read More : కార్యకర్తలే తమ బలం….బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని రఘునందన్ రావు చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో కలకలం రేపుతున్నాయి. అంతేకాదు తామే కొందరు నేతలను కారు పార్టీలోకి పంపించామని చెప్పడం సంచలనంగా మారింది. స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ లు అలానే అదికార పార్టీలో చేరారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.మరోవైపు సీఎం కేసీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఈటల రాజేందర్. 20 ఏళ్ల కాలంలో కేసీఆర్‌తో పెట్టుకుని బతికి బట్ట కట్టిన వాడు ఎవడు లేరన్నారు. తానొక్కడినే కేసీఆర్ కుట్రలను తట్టుకుని నిలబడ్డానని చెప్పారు. మునుగోడు నియోజకవర్గంలోని నాంపల్లి మండలం పగిడిపల్లిలో ఆయన ప్రచారం నిర్వహించారు. మునుగోడు నుండి పగిడపల్లికి రావడానికి మూడున్నర గంటల సమయం పట్టిందని అన్నారు రాజేందర్. హుజురుబాద్ లో 30 ఏళ్ల క్రితం ఇలాంటి రోడ్లు చూశామని తెలిపారు. కేసీఆర్ గొప్పగా చెప్పుకుంటున్న బంగారు తెలంగాణ ఎలా ఉందో మునుగోడును చూస్తే తెలుస్తుందన్నారు ఈటల రాజేందర్.
ఇవి కూడా చదవండి …
- కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే గారు మీకు ఇది తగునా? ప్రైవేట్ ఇనిస్ట్యూట్ శిక్షణకు వీఎం హోమ్ గ్రౌండ్ ఎందుకివ్వాలి??
- మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు….. ఈటల రాజేందర్
- మంత్రులను ప్రజా సమస్యలపై నిలదీయాలి…. సీఎం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి??
- మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
One Comment