
క్రైమ్ మిర్రర్, తెలంగాణ ప్రతినిధి : మునుగోడు నియోజకవర్గ ఉపఎన్నిక తీర్పు రేపటి తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తు అని బిజేపి ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్ అన్నారు. ఈరోజు నాంపల్లి మండలం పగిడిపల్లిలో బిజేపి అభ్యర్ది రాజగోపాల్ రెడ్డి గెలుపు కోసం ఆయన గ్రామంలో ప్రచార కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతు మునుగోడు ప్రజలకోసం రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేశారని అయన రాజీనామా వల్లనే ముఖ్యమంత్రి, 16 మంది మంత్రులు, 81 మంది ఎమ్మెల్యేలు మునుగోడుకు వచ్చారన్నారు.
Read Also : కేటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
రాజగోపాల్ రెడ్డి రాజీనామా ఫలితంగా గట్టుప్పల్ మండలం ఏర్పడిందని, 10 లక్షల మందికి పెన్షన్లు వచ్చాయన్నారు. కరోనా సమయంలో కూడా బయటికి వచ్చి ఒదార్చని కెసిఆర్ రాజగోపాల్ రెడ్డి గొంతు నొక్కడానికి స్వయంగా వచ్చి లెంకలపల్లిలో కుర్చీ వేసుకొని కూర్చొని రాజగోపాల్ రెడ్డిని ఒడిస్తానని కలలు కంటునాడని ఆయన ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ పార్టీకి ఓటు వేయకుంటే పెన్షన్ ఆపడం వారి అబ్బ జాగీరు కాదని, కెసిఆర్ మెడలు వంచి సంక్షేమ పథకాలు అందేలా చూస్తామని ఆయన అన్నారు.
Also Read : ప్రచారానికి వస్తున్న మంత్రులను ప్రజా సమస్యలపై నిలదీయాలి…. సీఎం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి??
కేంద్రం డబ్బులు ఇస్తున్నా కూడా డబుల్ బెడ్ రూం కట్టలేని సన్యాసి కెసిఆర్ అని అబద్దాల కొరు, మాటలతోవంచిచి ప్రజలను మోసం చేసే వ్యక్తి కెసిఆర్ అని, మోసంచేసే వారికి బుద్ది చెప్పే ఎన్నిక మునుగోడు ఉపఎన్నికని ఆయన తెలిపారు. రాజగోపాల్ రెడ్డి ఇప్పటికే ఎమ్మెల్యే, అయన గెలిస్తే ఎమ్మెల్యే కంటే పెద్ద పదవి ఏమీ రాకపోవచ్చు కానీ కెసిఆర్ అహంకారం అణుగుతుందన్నారు. మునుగోడులో గెలిచేది వ్యక్తి కాదని 4 కోట్ల ప్రజల ఆత్మగౌరవమని ఆయన అన్నారు. మాటలు చెప్పి ఓట్లు వేసుకొని పోవడానికి రాలేదని, మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు అని అంతటి పెద్ద భాధ్యత మునుగోడు ప్రజల చేతుల్లో పెట్టి వెళ్తున్నాం అని ఈటల రాజేందర్ అన్నారు. ఆయన వెంట సంకినేని వెంకటేశ్వర్లు, విజయేందర్ రెడ్డి, స్థానిక నేతలు ఉన్నారు.
ఇవి కూడా చదవండి :
- మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బిజేపి…. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
- మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
- ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
- మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
3 Comments