
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. ఉద్యమకారులను తిరిగి సొంత గూటికి రప్పించేందుకు సీఎం కేసీఆర్ వ్యూహాలు రచిస్తుండగా.. కమలం పార్టీ అదే స్థాయిలో కౌంటర్ ప్లాన్స్ చేస్తోంది. స్వామి గౌడ్, బూడిద బిక్షమయ్య గౌడ్, దాసోజు శ్రవణ్ కుమార్ చేరికలతో గులాబీ పార్టీలో జోష్ పెరిగింది. దీంతో కారు స్పీడుకు బ్రేకులు వేసేలా బీజేపీ మంత్రాగం చేస్తోంది. టీఆర్ఎస్ కి చెందిన ఎంపీ, మాజీ ఎంపీలకు కమలం పార్టీ గాలం వేస్తోంది. ఇందులో భాగంగానే టీఆర్ఎస్ ఎంపీకి గాలం వేస్తున్నట్లు తెలుస్తోంది.
Read More : సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
ప్రముఖ వ్యాపారవేత్తగా బాగా పలుకుబడి ఉండి ఆర్ధికంగా సౌండ్ పార్టీ కావడంతో కమలనాథులు గులాబీ పార్టీకి చెందిన ఆ ఎంపీని అక్కున చేర్చుకునేందుకు మంతనాలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ శివారు లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండటం… రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో సదరు ఎంపీని తమ వైపు తిప్పుకుంటే బీజేపీకి మంచి మైలేజ్ రావడమే కాకుండా టీఆర్ఎస్‌ని గట్టి దెబ్బ కొట్టినట్లుగా ఉంటుందని బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి. అందుకే ఆయనతో రాజకీయ సంప్రదింపులు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది.
Read More : మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న మునుగోడు ఓటర్లు..
టీఆర్ఎస్ ఎంపీతో బీజేపీ చేరికల కమిటీ చైర్మెన్ ఈటల రాజేందర్‌తో సత్సంబంధాలు ఉన్నాయి. ఈ పాయింట్‌ని పట్టుకొని అటు నుంచి చక్రం తిప్పుతోంది కాషాయం పార్టీ. టీఆర్‌ఎస్‌లో సైలెంట్ లీడర్‌గా కొనసాగుతున్న ఆ ఎంపీ కూడా కమలం గూటికి చేరితేనే బెటర్ అనే ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తోంది. పౌల్ట్రీ రంగంలో లీడింగ్ బిజినెస్‌మెన్‌గా ఉన్నారు. పలు వ్యాపార సంస్థల్లో ఈటల రాజేందర్‌తో భాగస్వామ్యం ఉంది. రాజకీయం, వ్యాపారాభివృద్ది కోణంలో ఆలోచించే బీజేపీలో చేరడమే బెటర్ ఆప్షన్‌గా గులాబీ పార్టీకి చెందిన ఎంపీ భావిస్తున్నారట.
ఇవి కూడా చదవండి …
- స్వామి గౌడ్, దాసోజులు బీజేపీ కోవర్టులా? కమలం నేతలే కారెక్కించారా?
- కార్యకర్తలే తమ బలం….బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు
- కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
- ఎమ్మెల్యే గారు మీకు ఇది తగునా? ప్రైవేట్ ఇనిస్ట్యూట్ శిక్షణకు వీఎం హోమ్ గ్రౌండ్ ఎందుకివ్వాలి??
- మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు….. ఈటల రాజేందర్