
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీరుపై చెప్పడానికి పదజాలం కూడా లేదని కాంగ్రెస్ అభ్యర్ధి స్రవంతి అన్నారు. సోదరిగా వెళ్లి అన్నా మీ ఆశీర్వాదం కావాలని ఎన్నోసార్లు కోరినా నమ్మకద్రోహం చేసేలా మాట్లాడటం బాధగా ఉందన్నారు. ధనబలానికి, ప్రజాస్వామ్యానికి మధ్య జరుగుతుంది మునుగోడు ఉప ఎన్నిక అని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం అందరూ కంకణబద్ధులై పనిచేస్తున్న సమయంలో ఇలా చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి వెనుక జరుగుతున్న కుట్రలకు నిదర్శనమే ఈ సంఘటనలని చెప్పుకొచ్చారు.
Also Read : మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు….. ఈటల రాజేందర్
మునుగోడులో ప్రచారానికి రావాలని చాలాసార్లు వెంకటరెడ్డిని వేడుకున్నానని, ఇప్పుడు ఆయన వైఖరి చూసి షాక్‌కు గురయ్యానని స్రవంతి తెలిపారు. మునుగోడు టికెట్ తనకు రావడానికి వెంకటరెడ్డి కృషి చేశారని, ఇప్పుడు ఆయన తనకు వ్యతిరేకంగా పనిచేయడం బాధ అనిపిస్తోందన్నారు. తనకు ఎవరు మద్దతు ఇచ్చినా, ఇవ్వకపోయినా ప్రజల బలం తనకు ఉందని, మునుగోడులో గెలిచేది కాంగ్రెస్‌నే అని స్రవంతి తెలిపారు. తన తండ్రి పాల్వాయి గోవర్దన్ రెడ్డి ఐదుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి రాజ్యసభ ఎంపీగా పనిచేశారని, కానీ ఆస్తులు మాత్రం కూడబెట్టుకోలేదని స్పష్టం చేశారు. ఇక మునుగోడు ఉపఎన్నిక వేళ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలకలం సృష్టిస్తున్నారు.
Read Also : ఎమ్మెల్యే గారు మీకు ఇది తగునా? ప్రైవేట్ ఇనిస్ట్యూట్ శిక్షణకు వీఎం హోమ్ గ్రౌండ్ ఎందుకివ్వాలి??
ఆడియో లీకులు,వీడియోలతో రాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతోన్నారు. మునుగోడు ఉపఎన్నికలో తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని, పార్టీలకతీతంగా ఓటు వేయాలని ఓ కాంగ్రెస్ నేతతో వెంకటరెడ్డి ఫోన్‌లో మాట్లాడిన ఆడియో టేప్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దీంతో పాటు తాను ప్రచారం చేసినా మునుగోడులో కాంగ్రెస్ గెలవదంటూ ఆస్ట్రేలియా పర్యటనలో అభిమానులతో మాట్లాడిన వీడియో కాంగ్రెస్ వర్గాల్లో గుబులు రేపుతోంది.
Also Read : కేటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
ఆస్ట్రేలియాలో తనను కలిసిన అభిమానులతో వెంకటరెడ్డి మాట్లాడిన వీడియో బయటకు వచ్చింది. కాంగ్రెస్ ఖచ్చితంగా ఓడిపోతుందని తెలిసి కూడా ప్రచారం చేయాలని అనడంలో అర్థం లేదన్నారు. మునుగోడు ఉపఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి గెలుస్తారంటూ జోస్యం చెప్పుకొచ్చారు. పాతికేళ్లుగా తాను రాజకీయాల్లో ఉన్నానని, ఇక రాజకీయాలు చాలని అనిపిస్తోందన్నారు. రాజకీయాల నుంచి హ్యాపీగా రిటైర్మెంట్ అవుతానంటూ వెంకటరెడ్డి చెప్పుకొచ్చారు. మునుగోడులో రెండు పార్టీల మధ్య పోటాపోటీ నెలకొందని, కాంగ్రెస్ ఫైనాన్షియల్‌గా చాలా వీక్‌గా ఉందని తెలిపారు. తాను మునుగోడులో ప్రచారం చేస్తే డబ్బులు ఎవరు పెట్టాలి అంటూ వెంకటరెడ్డి ప్రశ్నించారు.
ఇవి కూడా చదవండి :
- ప్రచారానికి వస్తున్న మంత్రులను ప్రజా సమస్యలపై నిలదీయాలి…. సీఎం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి??
- మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బిజేపి…. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
- మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
- ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
One Comment