
క్రైమ్ మిర్రర్, తెలంగాణ ప్రతినిధి : బిజేపి పార్టీకి కార్యకర్తలే బలమని ఎంత మంది వచ్చి వెళ్లినా బీజేపీ దూకుడును ఆపలేరని దుబ్బాక ఎంఎల్‌ఏ రఘునందన్ రావు తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం నాడు మునుగోడు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నియోజకవర్గానికి సంబంధం లేని వ్యక్తులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు, వారు పార్టీని వీడినంతా మాత్రాన తమకు వచ్చే నష్టమేమీ లేదని అన్నారు.
Read Also : కోమటిరెడ్డి వీడియోపై పాల్వాయి స్రవంతి ఫైర్….వెన్నుపోటు పొడిచారంటూ తీవ్ర వ్యాఖ్యలు
‘ఆర్‌ఆర్‌ఆర్’ను బ్రేక్ చేయలేరని మరో ‘ఆర్’ను ఆపలేరంటూ రఘునందన్ రావు వ్యాఖ్యనించారు. మునుగోడు నుంచి ఇంకొక ఆర్‌ను గెలిపించుకొని అసెంబ్లీకి నాలుగో ఆర్‌ను తీసుకుని పోతా అని అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాగానే భయంతో హడావుడిగా అభివృద్ధి పనులు చేపట్టారని టీఆర్‌ఎస్‌పై మండిపడ్డారు. మూడేళ్లుగా గొర్రెల కాపరులకు సంబంధించిన నిధులు ప్రభుత్వం ఎందుకు విడుదల చేయలేదని ప్రశ్నించారు. గతంలో చౌటుప్పల్ నుంచి సంస్థాన్ నారాయణపురం వరకు రహదారి మంజూరు చేసి ఇప్పుడు పూర్తి చేస్తున్నారన్నారు. ఓటమి భయంతోనే టీఆర్ఎస్ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టిందన్నారు. వెయ్యి కోట్లు పంచయినా మునుగోడు గెలవాలని టిఆర్‌ఎస్ ప్రయత్నం చేస్తుందని అన్నారు.
Also Read : ఎమ్మెల్యే గారు మీకు ఇది తగునా? ప్రైవేట్ ఇనిస్ట్యూట్ శిక్షణకు వీఎం హోమ్ గ్రౌండ్ ఎందుకివ్వాలి?
మర్రిగూడ మండలంలో నిర్మిస్తున్న శివన్న గూడెం ప్రాజెక్టు నిర్వాసితులకి న్యాయం చేయలేదని, తోటపల్లి రిజరువాయర్ వద్దని రైతులు చెప్పిన వినకుండా మెదలు పెట్టి ఇప్పుడు క్యానసల్ చేశారని తెలిపారు. మునుగోడు ఎన్నిక తరువాత కరీంనగర్, రంగారెడ్డి, వరంగల్, నల్గొండ జిల్లాల నుండి ఇద్దరు చొప్పున అధికార పార్టీ ఎమ్మెల్యేలు బిజెపిలోకి వస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో ప్రచారం చేసిన వాళ్లపై పరువు నష్టం దావా వేయనున్నట్లు ఆయన తెలిపారు. ప్రతిపక్ష ఎమ్మెల్యే ల మీద చేసే కక్ష సాధింపు చర్యలకు వ్యతిరేకంగా జరుగుతున్న ఈ ఎన్నికలో దర్మం వైపు నిలబడాలని ఆయన నియోజకవర్గ ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు….. ఈటల రాజేందర్
- కేటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
- ప్రచారానికి వస్తున్న మంత్రులను ప్రజా సమస్యలపై నిలదీయాలి…. సీఎం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి??
- మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బిజేపి…. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
One Comment