
క్రైమ్ మిర్రర్, ఎల్‌బి నగర్ : వీఎం హోమ్ మైదానంలో ప్రతినిత్యం చుట్టుపక్కల కాలనీలకు చెందిన ఎంతోమంది సీనియర్ సిటిజెన్లు, యువకులు ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం వాకింగ్ చేసుకుంటారని టీపీసీసీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి తెలిపారు. అయితే ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గత మూడు రోజులుగా వాకర్స్ ను భయాందోళనలకు గురి చేసే విధంగా వ్యవహరిస్తూ, ఒక పోలీస్ ప్రైవేట్ శిక్షణ సంస్థకు మైదానాన్ని కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. డిసిసి అధ్యక్షుడు చల్లా నరసింహారెడ్డి తో కలిసి, జక్కిడి ప్రభాకర్ రెడ్డి వి ఎం హోమ్ మైదానాన్ని సందర్శించారు.
Read Also : మునుగోడు తీర్పు రేపటి తెలంగాణ భవిష్యత్తు….. ఈటల రాజేందర్
వీఎం హోమ్ పూర్వ విద్యార్థుల సంఘం, విఎం హోమ్ భూముల పరిరక్షణ సంఘం, వీఎం హోమ్ యాజమాన్యం సైతం ఎమ్మెల్యే వైఖరి పై మండిపడుతున్నారని జక్కిడి ప్రభాకర్ రెడ్డి, చల్లా నరసింహారెడ్డిలు తెలిపారు. కానిస్టేబుల్ శిక్షణ పొందే విద్యార్థుల నుంచి వేలాది రూపాయల రూ. ల ఫీజులు వసూలు చేసే, ప్రైవేట్ పోలీస్ శిక్షణ సంస్థకు వి.ఎం హోం మైదానాన్ని కట్టబెట్టాలన్న ఎమ్మెల్యే నిర్ణయం వెనకనున్న మతలబు ఏమిటని ప్రశ్నించారు. ఆ సంస్థ తో సుధీర్ రెడ్డి ఎంతకు లాలూచీ పడ్డారో చెప్పాలని డిమాండ్ చేశారు. లేకపోతే ప్రతినిత్యం మైదానంలో ఆరోగ్య పరిరక్షణ నిమిత్తం వాకింగ్ చేసే సీనియర్ సిటిజనులను, యువకులను ఎందుకు బెదిరించారని నిలదీశారు. ఇప్పటికైనా ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తన వైఖరిని మార్చుకోవాలని, లేకపోతే ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు.
Also Read : కేటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
అసలు నువ్వు ఒక ప్రజా ప్రతినిధి వేనా?
ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి రాజ్యాంగాన్ని అపహాస్యం చేస్తున్నారని టీపీసీసీ కార్యదర్శి, ఎల్బీనగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి విమర్శించారు. తాజాగా వనస్థలిపురంలో నిర్వహించిన మునుగోడు ఓటర్ల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికలలో తొలుత స్థానికంగా ఓటు వేసి, మునుగోడు కు వెళ్లి మరొక ఓటు వేయాలని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు ఒక వ్యక్తి రెండు ఓట్లు వేయాలని ప్రజా ప్రతినిధిగా వ్యవహరిస్తున్న వ్యక్తి ప్రోత్సహించడం ఎన్నికల నిబంధనలకు పూర్తి విరుద్ధమని జక్కిడి ప్రభాకర్ రెడ్డి అన్నారు.
Read Also : ప్రచారానికి వస్తున్న మంత్రులను ప్రజా సమస్యలపై నిలదీయాలి…. సీఎం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి??
మునుగోడు నియోజకవర్గ ఓటర్లను టిఆర్ఎస్, బిజెపిలు ఆత్మీయ సమ్మేళనాల పేరిటప్రలోభ పెడుతుంటే రాష్ట్ర ఎన్నికల సంఘం ఏమి చేస్తుందని ప్రశ్నించారు. ఇదేనా ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ అంటే అంటూ నిలదీశారు. ఓటర్లను ప్రలోభ పెడుతున్న బిజెపి, టిఆర్ఎస్ పార్టీలు వందల కోట్ల రూపాయల దనాన్ని ఖర్చు పెడుతున్న ఎన్నికల కమిషన్ కంటికి కనిపించకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. మునుగోడు ఓటర్ల కోసం ఎల్బీనగర్ నియోజకవర్గ పరిధిలో నిర్వహిస్తున్న ఆత్మీయ సమ్మేళనాలపై ఎన్నికల కమిషన్ తక్షణమే చర్యలు తీసుకొని వాటికి అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఎన్నికల నిర్వహణ, ప్రజాస్వామ్యం అపహాస్యం పాలయ్యే ప్రమాదం ఉందని జక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.
ఇవి కూడా చదవండి :
- మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బిజేపి…. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
- మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
- మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
- ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
- మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
2 Comments