
క్రైమ్ మిర్రర్, రంగారెడ్డి నిఘా : హయత్ నగర్ వినాయక నగర్ కాలనీలో నివాసం ఉండే మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో అవినీతి నిరోధక శాఖ అధికారుల సోదాలు నిర్వహించారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు అధికారులు ఇంట్లోకి రానివ్వకుండా సోదాలు చేశారు. ఈసందర్భంగా పెద్ద మొత్తంలో స్థిర, చర ఆస్తులను గుర్తించినట్లు తెలుస్తుంది. సుమారు రూ. 14 లక్షల వరకు నగదును స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. విలువైన డాక్యుమెంట్లు లాకర్ లో ఉన్నట్లు తెలిసింది. మల్కాజ్గిరి సబ్ రిజిస్టర్ కార్యాలయంతో పాటు బంధువుల ఇంట్లో కూడా సోదాలు చేసినట్లు అధికారులు తెలిపారు.
Read More : రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
గత మెంతో అవినీతిమయం..? ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న ప్రైవేటు సేనతో.. లావాదేవీలు : పలని కుమారి జులై 1, 2017లో అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ గా పనిచేస్తుంది. ఆ సమయంలోనే అవినీతి ఆరోపణలు ఆమెపై వచ్చాయి. అవినీతిని ప్రశ్నించిన వారిపై కేసులు కూడా పెట్టిందని తెలిసింది. అబ్దుల్లాపూర్ మెట్టులోని సర్వేనెంబర్ 76లో గల 2 ఎకరాల భూమి రిజిస్ట్రేషన్ విషయంతో రియల్ ఎస్టేట్ వ్యాపారితో పలనికుమారి గొడవ పడింది. ధరణిలో పట్టాదారు పేర్లు వస్తున్న పట్టాదారు పాసు పుస్తకాలు లేవనే కారణంతో రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేసింది. 50,000 ఇస్తే చేస్తానని చెప్పిందని ఆ తర్వాత డాక్యుమెంట్ టేబుల్ పైకి వేల్లగానే రూ. 1లక్ష డిమాండ్ చేయడంతో సదరు వ్యాపారి ఆమెతో గొడవ పడినట్లు సమాచారం. ఈవిషయం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారం లేచింది. అన్ని పత్రికల్లో వార్తలు ప్రచురించబడ్డాయి. దీంతో సబ్ రిజిస్టర్ తన విధులకు ఆటంకం కలిగించాడని అబ్దుల్లాపూర్ మెట్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.
Read More : మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
అబ్దుల్లాపూర్ మెట్టులో సర్వేనెంబర్ 69, 70, 71, 147/అ లోని భూముల్లో వ్యవహారంలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. బండ రావిరాల లోనే భూమి మార్టిగేజ్ విషయంలో సబ్ రిజిస్టర్ భూమి యజమాని రూ.2 లక్షలు డిమాండ్ చేసినట్లు కూడా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. లింగాయకుంట భూముల రిజిస్ట్రేషన్ విషయంలోనే ఓ యువకుడు సబ్ రిజిస్టర్ పై స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ అప్పటి కమిషనర్ చిరంజీవులకు ఫిర్యాదు చేశాడు. దీంతో సబ్ రిజిస్టర్ పలణికుమారిని డిప్యూటేషన్ పై కల్వకుర్తికి పంపారు. అక్కడ పని చేసే దేవానంద్ ను అబ్దుల్లాపూర్ మెట్టుకు బదిలీ చేశారు. 8 నెలల అనంతరం మళ్లీ ఆమె అబ్దుల్లాపూర్ మెట్ కార్యాలయానికి వచ్చింది. రెండు నెలల తర్వాత మల్కాజ్గిరికి బదిలీపై వెళ్లారు. నల్లగొండలో పని చేసే సమయంలో నకిలీ చాలానను పలువురికి ఇచ్చి రిజిస్ట్రేషన్ శాఖకు సుమారు కోటి రూపాయల నష్టం కలిగేలా వ్యవహరించారనే ఆరోపణలు ఉన్నాయి.
Read More : పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పద్మారావు సంచలన ప్రకటన..
ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకున్న సభ్యులతోనే డిలింగ్ : అబ్దుల్లాపూర్ మెట్ సబ్ రిజిస్టర్ కార్యాలయం వద్ద పలణికుమారి కొంతమందిని తన మనుషులను ఏర్పాటు చేసుకొని వారి ద్వారానే పలు డీలింగును చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. వివాదాస్పద భూములు, ప్లాట్లు, డబుల్ రిజిస్ట్రేషన్ చెక్కబెట్టేవారని అప్పట్లో వార్తలు గుప్పుమాన్నాయి. వారు అన్ని రకాలు సబ్ రిజిస్టర్ కు అండగా ఉండేవారని పలువురు డాక్యుమెంట్ రైటర్లు చర్చించుకునేవారు.
పెద్ద ఎత్తున భూములు ఉన్నట్లు సమాచారం : పలణికుమారి పెద్ద ఎత్తున వివిధ ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు తెలిసింది. నల్గొండ జిల్లా చిన్నకాపర్తి చండూరులో విలువైన భూములు కలిగి ఉన్నట్లు తెలుస్తుంది. ఇటీవల వనస్థలిపురంలో 300 గజాల విలువైన ప్లాటు కొనుగోలు చేసినట్లు సమాచారం నల్లగొండలో పనిచేసే సమయంలో కిలల కొద్ది బంగారం ఆభరణాలు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఇటీవల వినాయక నగర్ కాలనీలోని ఇల్లును అమ్మకానికి పెట్టినట్టు తెలిసింది. 2010 కన్న ముందు పలణికుమారి టీచర్ గా పని చేసి ఆ తర్వాత గ్రూప్ 2 పరీక్ష రాసి సబ్ రిజిస్టర్ గా ఉద్యోగం పొందినది. టీచర్ గా ఉన్న సమయంలోను చిన్నపిల్లలకు ఇవ్వాల్సిన బియ్యంలో గోల్ మల్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె అచ్చంపేట, నల్లగొండ, అబ్దుల్లాపూర్ మెట్, కల్వకుర్తి మల్కాజ్గిరి లలో పనిచేసినట్లు తెలుస్తుంది.
మెండుగా ఉన్నతాధికారుల అండదండలు..? : సబ్ రిజిస్టర్ అవినీతిని ఎవరు ప్రశ్నించిన దిక్కున చోట చెప్పుకోమని అనేవారని పలువురు తెలిపారు. కల్వకుర్తికి బదిలీ చేసిన తిరిగి అబ్దుల్లాపూర్ మెట్టుకు మళ్లీ వచ్చి విధులు నిర్వహించారు.. అంటే ఆమెకు ఉందో అర్థం చేసుకోవచ్చు…
ఇవి కూడా చదవండి …
7 Comments