
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉపఎన్నిక మునుగోడులోని ప్రజలకు పండుగ వాతావరణాన్ని తీసుకువచ్చింది. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలోని ఓటర్లను ప్రలోభ పెట్టడం కోసం రాజకీయ పార్టీల నేతలు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే మునుగోడులో నాటు కోళ్లు, గొర్రెలు మాయమయ్యాయి. ఇక మునుగోడు నియోజకవర్గంలో కోట్ల రూపాయల మద్యం ఏరులై పారుతుంది. ఓటర్ల కోసం విహారయాత్రలు, యువత కోసం గోవా ట్రిప్ లు, యాదాద్రి ఆలయ సందర్శనలు వెరసి మునుగోడులో ప్రలోభాల పర్వం పీక్స్ కు చేరుకుంది.
Read More : మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
ఇప్పటికే దసరా పండుగ సందర్భంగా ఇంటింటికీ చికెన్, మటన్ పంపించిన రాజకీయ పార్టీల నాయకులు, ఇప్పుడు మునుగోడు ఓటర్లకు దీపావళి ధమాకా ఆఫర్లతో సిద్ధమవుతున్నారు. దీపావళి పండుగ సందర్భంగా మునుగోడు ఓటర్లను తమవైపు తిప్పుకోవడం కోసం మహిళలకు చీరలు, పిల్లలకు స్వీట్లు, బాణాసంచా బ్యాగులు సిద్ధం చేస్తున్నారు. ఇక పురుషులకు తిన్నంత నాన్వెజ్, తాగినంత మద్యం పంపిణీ చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నారు. యువతను ఆకట్టుకోవడానికి, వారి ఎంటర్టైన్మెంట్ కోసం స్పెషల్ ప్యాకేజీ లను కూడా సిద్ధం చేస్తున్నారు ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు.
Read More : ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
దీపావళి పండుగ సందర్భంగా యువతకు కొత్త బట్టలు కొని ఇస్తూ, ఇంటింటికీ పండుగ తోఫా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటికే గ్రామాలలో ఉన్న బెల్టుషాపులను గుత్తకు తీసుకున్న రాజకీయ పార్టీల నాయకులు, అక్కడికి వచ్చే గ్రామస్తులకు మద్యంతో పాటు, మంచింగ్ కూడా ఇవ్వాలని ఏర్పాట్లు చేశారు. ఇక హోటళ్ళను సైతం గుత్తకు తీసుకుని మరీ తినిపిస్తున్నారు.మునుగోడులో ఓట్ల కోసం డబ్బులు, మద్యం, మాంసం పంపిణీ చేస్తూ ఓట్ల కోసం కోట్లు గుమ్మరిస్తున్నారు. ఇక అంతే కాదు ప్రజల బలం ఉన్న నాయకులకు గాలం వేసి, వారికి నజరానాలు ప్రకటిస్తూ పార్టీ కండువాలు మారుస్తూ, ఫిరాయింపు రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారు.
Read More : సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
మునుగోడు ఓటర్లను ప్రసన్నం చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తున్న ప్రధాన రాజకీయ పార్టీల నాయకులు, భవిష్యత్తు ఎన్నికలకు మునుగోడు ఉప ఎన్నికల ఫలితాలు దిశానిర్దేశం చేస్తాయి అన్న భావనతో ఈ ఉప ఎన్నికను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్నారు. ప్రతి ఎన్నికలలోనూ ప్రలోభాలు పర్వం కామనే అయినప్పటికీ, మునుగోడు ఉప ఎన్నికల్లో మాత్రం ప్రలోభాల పర్వం బౌండరీలు దాటి ఆసక్తికరంగా మారింది. నియోజకవర్గంలోనే కాకుండా, రాష్ట్రంలోనూ, దేశంలోనూ మునుగోడు ఉప ఎన్నిక పై చర్చ సాగేలా మారింది.
ఇవి కూడా చదవండి :
- మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
- రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
- పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పద్మారావు సంచలన ప్రకటన..
- కేసీఆర్ కు అనారోగ్యం.. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి అధికారులు.. ఏం జరుగుతోంది?
- మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న మునుగోడు ఓటర్లు..
One Comment