
క్రైమ్ మిర్రర్, నాంపల్లి : మునుగోడు ఉపఎన్నిక వేళ నియోజకవర్గంలో పోస్టర్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. రాత్రికి రాత్రి వెలుస్తున్న పోస్టర్లు నియోజకవర్గంలో పెద్ద దుమారాన్ని రేపుతోన్నాయి. తరచూ ఏవో ఒక పోస్టర్లు నియోజకవర్గంలోని గోడలపై అర్థరాత్రి నుంచి దర్శనమిస్తున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నిత్యం సెగ్మెంట్‌లో ఎక్కడో ఒకచోట పోస్టర్లు వెలుస్తూనే ఉన్నాయి. పోలింగ్ ముగిసేవరకు ఈ పోస్టర్ల వ్యవహారం ఆగేలా కనిపించడం లేదు. తాజాగా మరోసారి నియోజకవర్గంలో పోస్లర్ల కలకలం రేగుతోంది.
Read More : ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
నాంపల్లి మండల కేంద్రంలో అర్థరాత్రి బీజేపీకి వ్యతిరేకంగా గోడలపై కొంతమంది ఆగంతకులు పోస్టర్లు అతికించారు. లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని బీజేపీ కుట్ర చేస్తోందంటూ పోస్టర్లలో కనిపిస్తోంది. ‘లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని ఢిల్లీలో బీజేపీ కుట్రలు.. మునుగోడులో రాజగోపాల్ రెడ్డి లంబాడీల ఓట్లను కొనాలని బీజేపీ దుష్ట రాజకీయాలు.. మేం మీలాగా అమ్ముడుపోయే వాళ్లం కాదు.. ఖబడ్డార్ బీజేపీ’ అంటూ లాంబాడీలు హెచ్చరిస్తున్నట్లు పోస్టర్లలో ఉంది. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా కొంతమంది ఈ పోస్టర్లను ఏర్పాటు చేశారు. రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా రోజూ పోస్టర్లు వెలుస్తూనే ఉన్నాయి.
Read More : సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
ఆయనకు వ్యతిరేకంగా ప్రత్యర్థులు అనేక పోస్టర్లతో హల్‌చల్ సృష్టిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి రూ.18 వేల కోట్ల కాంట్రాక్ట్ తీసుకున్నారంటూ ఇటీవల ‘కాంట్రాక్ట్ పే’తో ఏర్పాటైన పోస్టర్లు మునుగోడులో పెద్ద దుమారం రేపాయి. గురువారం కూడా ఆయనకు వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు అయ్యాయి. ‘తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న పెన్షన్ల కంటే ఎక్కువ ఏ ఒక్క బీజేపీ రాష్ట్రమైనా ఇస్తుందని చెప్పే దమ్ముందా రాజగోపాల్ రెడ్డి?’ అంటూ గోడలపై పోస్టర్లు దర్శనమిచ్చాయి. తెలంగాణ, గుజరాత్, ఉత్తర్ ప్రదేశ్‌లలో వృద్ధులు, దివ్యాంగులు, ఒంటరి మహిళలకు ఎంతెంత పెన్షన్ ఇస్తున్నారనే వివరాలను పోస్టర్లలో పొందుపర్చారు. తెలంగాణ ఇస్తున్న పెన్షన్ నగదును గుజరాత్, ఉత్తరప్రదేశ్‌తో పోలుస్తూ.. దీనికి రాజగోపాల్ రెడ్డి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Read More : మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
వరుసగా రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నియోజకవర్గంలో ప్రత్యర్థులు ఏర్పాటు చేస్తోన్న పోస్టర్లు బీజేపీ వర్గాలను కలవరపాటుకు గురి చేస్తోన్నాయి. మునుగోడులో ఎలాగైనా గెలవడం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటాలని భావిస్తున్న బీజేపీకి ఈ పోస్టర్లు తలనొప్పిగా మారాయి. బీజేపీని ప్రశ్నిస్తూ ఏర్పాటు అవుతున్న పోస్టర్లు కాషాయ నేతలను ఉక్కిరిబిక్కిరి చేస్తోన్నాయి. మునుగోడు ఎన్నికలు ముగిసే వరకు తమకు ఈ పోస్టర్ల సెగ తప్పేలా లేదని కమలం నేతలు గుసగుసలాడుకుంటున్నారు. కాగా గతంలో మోదీ, అమిత్ షా హైదరాబాద్ పర్యటనల సమయంలో కూడా పోస్టర్లు వెలిసిన విషయం తెలిసిందే.
ఇవి కూడా చదవండి :
- రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
- పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పద్మారావు సంచలన ప్రకటన..
- కేసీఆర్ కు అనారోగ్యం.. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి అధికారులు.. ఏం జరుగుతోంది?
- మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న మునుగోడు ఓటర్లు..
- ఏపీ మంత్రి రోజాపై చెప్పులు, చీపుర్లతో దాడి –

2 Comments