
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు నియోజకవర్గ ప్రజలకు మాయమాటలు చెప్పి బిజేపి మోసం చేస్తుందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ప్రభుత్వ విప్ ఎంఎల్‌ఏ బాల్క సుమన్ విమర్శించారు. శుక్రవారం నాడు మునుగోడు నియోజకవర్గం చండూరు మండల కేంద్రంలో వారు మాట్లాతు బిజేపి రాష్ట్ర అద్యక్షుడు బండి సంజయ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి దయాకర్ మాట్లాడుతు జిహెచ్‌ఎంసి, దుబ్బాక, హుజూరాబాద్ లలో ప్రజలకు మాయమాటలు చెప్పి గెలిచి ఏం అభివృద్ధి చేశారని ఆయన ప్రశ్నించారు.
Also Read : మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
నాగార్జునసాగర్, హుజూర్ నగర్ ఉప ఎన్నికల్లో టిఆర్‌ఎస్ పార్టీ గెలిచి ఎంత అభివృద్ధి జరిగిందో బిజేపి నాయకులు వస్తే చూపిస్తామని ఆయన సవాల్ విసిరారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ లో ఫ్లోరైడ్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేస్తామని అప్పటి కేంద్ర ఆరోగ్య మంత్రిగా ఉన్న ఇప్పటి జాతీయ అద్యక్షుడు జేపి నడ్డ ఇచ్చిన మాట ఎటుపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మునుగోడు ప్రజలు చైతన్యవంతులని బిజేపి నాయకుల మాయమాటలకు, ప్రలోభలకు లొంగరని ఆయన అన్నారు. మునుగోడులో బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలని హితవు పలికారు.
Read Also : మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
అనంతరం బాల్క సుమన్ మాట్లాడుతు మునుగోడులో గెలువలేక బిజేపి అనైతిక కార్యక్రమాలకు పాల్పడుతుందని ఎన్నికల సంఘాన్ని అడ్డుపెట్టుకొని బీజేపీ కుటిల యత్నాలు చేస్తుందని Evm లో కారు గుర్తును పోలిన గుర్తులను కావాలని బీజేపీ కుట్ర చేసి పెట్టించిందని అన్నారు. మోడీ చర్యల వల్ల దేశం నాశనం అవుతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు BRS పెట్టగానే బీజేపీ వాళ్ళు కాళ్ళ కింద మట్టి కదులుతుందని అన్నారు. బిజేపి నాయకులు అప్రజాస్వామ్యంగా వ్యవహరిస్తుందని, వారిపై ఎన్నికల సంఘం దృష్టి కేంద్రకరించాలని కోరారు. వారి వెంట టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
- సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
- మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
- డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి! మునుగోడులో మార్మోగుతున్న నినాదం
- మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఎర్ర గులాబీలు
2 Comments