
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : మునుగోడు ఉప ఎన్నికల ప్రచారానికి వస్తున్న రాష్ట్ర మంత్రులను ప్రజా సమస్యలపై ప్రజలు ఎక్కడికక్కడ నిలదీయాలని బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బత్తుల శ్రీధర్ యాదవ్ కోరారు. మునుగోడు నియోజకవర్గానికి గతంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయని ప్రజలు ఈ సందర్భంగా ప్రశ్నించాలన్నారు. మునుగోడు నియోజకవర్గ ప్రాంతానికి సాగునీరు అందించే చర్లగూడెం ప్రాజెక్ట్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందన్నారు.
Read More : కేటిఆర్ సమక్షంలో టిఆర్‌ఎస్ పార్టీలో చేరిన స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్
చర్లగూడెం ప్రాజెక్టు కంటే వెనుకనే చేపట్టిన కాలేశ్వరం ప్రాజెక్టు ఎందుకు పూర్తయిందని, ఆ ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ చర్లగూడెం ప్రాజెక్టు ఎందుకు లేదన్నారు . ఇప్పటికీ భూ నిర్వాసితులకు కనీసం ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీని కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వకపోవడం దారుణమని మండిపడ్డారు. ఉత్తర తెలంగాణ లో సాగునీటి ప్రాజెక్టులు శరవేగంగా పూర్తి కాగా, దక్షిణ తెలంగాణ పై ఈ వివక్ష ఎందుకో మంత్రులు, అధికార పార్టీ నేతలు చెప్పాలంటూడిమాండ్ చేశారు. ఇక కేజీ టు పీజీ ఉచిత విద్య అమలు చేస్తామని హామీ ఇచ్చిన అధికార టీఆర్ఎస్, 8 ఏళ్లుగా అయినా చౌటుప్పల్ డిగ్రీ కాలేజీ ఎందుకనీ ఏర్పాటు చేయలేక పోయిందన్న దానిపై ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నా మంత్రులు సమాధానం చెప్పాలన్నారు.
Read More : మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బిజేపి…. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
ఈ ప్రాంతానికి చెందిన వేలాదిమంది విద్యార్థులు ఉన్నత విద్య కోసం కార్పొరేట్ కాలేజీలను ఆశ్రయించవలసిన దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. సమైక్యాంధ్రలో ఏదైతే వివక్షత కొనసాగిందో, ఇప్పటికీ మునుగోడు నియోజకవర్గం పై అదే వివక్షత కొనసాగుతోందని బద్దుల శ్రీధర్ యాదవ్ అన్నారు. ఇక కొంతమంది బీసీ నాయకులుగా చెప్పుకునే వారు అధికార పార్టీ కార్యాలయంలోనే కూర్చొని టిఆర్ఎస్ అభ్యర్థికి మద్దతుగా ప్రెస్ మీట్లను ఏర్పాటు చేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు.. మునుగోడు టిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ఏమైనా బీసీ నాయకుడా?, అందుకని వారు టీఆర్ఎస్ కు మద్దతును ప్రకటిస్తున్నారా? అని ప్రశ్నించారు.
Read More : మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
మునుగోడు నియోజకవర్గంలో 67% ఉన్న బీసీల అభ్యున్నతికి ప్రభుత్వం ఏమైనా ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించిందని చెప్పి టిఆర్ఎస్ పార్టీకి మద్దతునిస్తున్నారా? చెప్పాలని నిలదీశారు. గొల్ల కురుమలకు గొర్రెల యూనిట్లలకు డీడీలు కట్టిన వారికి అకౌంట్లోకి నిధులను ట్రాన్స్ఫర్ చేసిన రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఫ్రీజ్ చేయడమే కాకుండా… మీరు ఎన్నికల ముందు దావతులు చేసుకుంటారని చెప్పి ప్రిజ్ చేశామని సాక్షాత్తు మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు గొల్ల కురుమలను అవమానించినట్లు కాదా?, ఈ వ్యాఖ్యలు సదరు బీసీ నేతల కళ్ళకు కనిపించడం లేదా అంటూ బద్దుల శ్రీధర్ యాదవ్ మండిపడ్డారు. ఇకనైనా అధికార పార్టీకి ఊడిగం చేయడం మాని బీసీ సమస్యలపై, రాజ్యాధికార సాధన పై…. బీసీ నేతలుగా చెప్పుకునేవారు గళం విప్పాలని డిమాండ్ చేశారు. అంతేకానీ బీసీ ప్రతినిధుల అంటూ ఒక పార్టీకి కొమ్మ కాయడాన్ని ప్రజలు హర్షించరని బత్తుల శ్రీధర్ యాదవ్ అన్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
- ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
- సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
- మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
- రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
One Comment