
క్రైమ్ మిర్రర్, చండూరు : చండూర్ మండలం, కస్తాల గ్రామం లో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూసుకుంట ప్రభాకర్ రెడ్డి గారి గెలుపు కోసం ప్రచారంలో భాగంగా ఇంటింటికి తిరిగి కారు గుర్తుకు ఓటు వేసి అత్యంత భారీ మెజార్టీగా గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్న నాగార్జునసాగర్ శాసనసభ్యులు ఎమ్మెల్యే నోముల భగత్ కుమార్ గారు సీఎం కేసీఆర్ గారు ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల గురించి ప్రతి ఒక్కరి ఓటరు ఇంటి వద్దకు వెళ్లి వివరించడం జరిగింది.
Read More : సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
గతంలో ఏ ప్రభుత్వాలు చేయలేని పనిని ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ గారు తెలంగాణ సాధించుకున్న తర్వాత పేదల ఇండ్లలో వెలుగులు నింపాలని ఆయన ప్రతి ఒక్కరికి ఏదో ఒక రూపంలో సంక్షేమ పథకాలు అదేవిధంగా చూసి తెలంగాణ ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని అన్నారు. ఒకప్పుడు గ్రామాలలో తాగడానికి నీళ్లు లేక ఇబ్బంది పడటం చూసి ప్రతి ఒక్కరికి గొంతు తడవాలని మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికి మంచినీరు అందించిన ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ గారే అని అన్నారు.
Read More : మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
తెలంగాణలో సీఎం కేసీఆర్ గారు ప్రవేశపెడుతున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేక గుజరాత్ గులాములు ఏదో ఒక రూపంలో కెసిఆర్ గారి మీద తప్పుడు ప్రచారం చేస్తున్నారని అటువంటి ప్రచారాలను ఎవరు నమ్మవద్దు అని అన్నారు. ప్రధానమంత్రి మోడీ రైతుల వ్యవసాయ బావుల దగ్గర మోటార్లకు మీటర్లు పెట్టమని చెప్పితే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా తెలంగాణ రైతులకు నేను మీటర్లు పెట్టను అని చెప్పిన నాయకుడు కేసీఆర్ గారు అని ఆయన తెలిపారు.
Read More : పార్టీ మార్పుపై ఎమ్మెల్యే పద్మారావు సంచలన ప్రకటన..
డబ్బు మదంతో కాంట్రాక్టుల కోసం మునుగోడు నియోజకవర్గ ప్రజల ఆత్మగౌరవం మీద దెబ్బకొట్టి ప్రజలను మోసం చేసి గుజరాత్ గులాం లతో కలిసి బీజేపీ లో చేరిన రాజగోపాల్ రెడ్డికి ప్రజలు ఓటు ద్వారా బుద్ధి చెప్పి కారు గుర్తుని గెలిపించుకుని ముఖ్యమంత్రి శ్రీ కెసిఆర్ గారికి బహుమానంగా ఇస్తే మునుగోడు నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందుతుందని అన్నారు.
ఇవి కూడా చదవండి :
- రాజగోపాల్ రెడ్డి సభను అడ్డుకుంటే ఐదు వేలు! మంత్రి జగదీశ్ రెడ్డి కుట్రలతోనే అల్లర్లు?
- కేసీఆర్ కు అనారోగ్యం.. స్పెషల్ ఫ్లైట్ లో ఢిల్లీకి అధికారులు.. ఏం జరుగుతోంది?
- మంత్రి మల్లారెడ్డికి చుక్కలు చూపిస్తున్న మునుగోడు ఓటర్లు..
- ఒక గౌడ్ పోయిండు.. మరో గౌడ్ వచ్చిండు! మునుగోడులో గంటకో ట్విస్ట్..
- బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ ఇచ్చిన హామీ ఇదే?
3 Comments