
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : శాసనమండలి మాజీ ఛైర్మన్ స్వామి గౌడ్, దాసోజు శ్రవణ్ టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. మంత్రి కేటిఆర్ విరిరువురికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. శుక్రవారం ఉదయం బిజేపి పార్టీ సభ్యత్వనికి రాజీనామా చేసి సాయంత్రం టిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈసందర్బంగా కేటిఆర్ మాట్లాడుతు రాష్ట్ర ప్రయోజనాలను కాపాడగలిగె నేత కేసిఆర్ మాత్రమేనని అన్నారు.
Read Also : మాయమాటలతో ప్రజలను మోసం చేస్తున్న బిజేపి…. మంత్రి ఎర్రబెల్లి, ప్రభుత్వ విప్ బాల్క సుమన్
కేసిఆర్ నాయకత్వంలో ఉద్యోగులందరిని ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రం కోసం వీరోచిత పోరాటం చేసిన వ్యక్తి స్వామి గౌడ్ అని ఆయన గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రభావశీల నాయకుడు దాసోజు శ్రవణ్ కూడా టిఆర్‌ఎస్ పార్టీలో చేరడం శుభపరిణమమని అన్నారు. స్వామి గౌడ్ మాట్లాడుతు తెలంగాణ రాష్ట్ర సదన కోసం అందరం కలసి పోరాటం చేశామని, రాష్ట్రాల మద్య సమస్యలను కేంద్రం పరిష్కరించాలని, విభజన సమస్యలు పరిష్కారమవుతాయనే ఉద్దేశంతో బిజేపిలో చేరమని తెలిపారు. ఏయశయం కోసం బిజేపిలో చేరామో అది నిరవేరలేదని, అందుకే బిజేపి నుండి టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతున్నట్లు ఆయన తెలిపారు.
Also Read : ప్రచారానికి వస్తున్న మంత్రులను ప్రజా సమస్యలపై నిలదీయాలి…. సీఎం ఇచ్చిన హామీలన్నీ ఏమయ్యాయి??
కేసిఆర్ నాయకత్వంలో అందరం కలసి పని చేయాలని ఆయన కోరారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతు ఆశలు, ఆకాంక్షలతో బిజేపిలోకి వెళ్తే అక్కడ గుర్తింపు లేదన్నారు. నవభారత నిర్మాణం కోసం ఉడత భక్తితో టిఆర్‌ఎస్ పార్టీలో చేరుతునట్లు ఆయన తెలిపారు. నా శ్వాస ఉన్నంత వరకు పార్టీలో పని చేస్తానని శ్రవణ్ తెలిపారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఇబ్రహీంపట్నం ఎంఎల్‌ఏ మంచిరెడ్డి కిషన్ రెడ్డి, కర్ణే ప్రభాకర్ టిఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి :
- మునుగోడు నియోజకవర్గ ఓటర్లకు దీపావళి ధమాకా…..
- మునుగోడు నియోజకవర్గంలో పోస్టర్ల కలకలం….
- ప్రచారంలో దూసుకపోతున్న నోముల భగత్… కస్తాల గ్రామంలో ఇంటింటి ప్రచారం
- సబ్ రిజిస్టర్ పలని కుమారి ఇంట్లో ఏసీబీ సోదాలు… గత మెంతో అవినీతిమయం..?
- మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం…
2 Comments