
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం తారా స్థాయికి చేరింది. పోలింగ్ తేది సమీస్తున్న కొద్ది నియోజకవర్గంలో రాజకీయం హాట్ హాట్ గా సాగుతోంది. ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడులోనే మకాం వేయడంతో గ్రామాల్లో ప్రచారం పోటీపోటీగా సాగుతోంది. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తుతున్నాయి. బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి వరుసగా షాకులు తగులుతున్నాయి. ప్రతి రోజు ఏదో ఒక చోటు ఆయన ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకుంటున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య గొడవలు జరుగుతున్నాయి.
Read More : గురువారం నుంచి మునుగోడులోనే కేసీఆర్.. ఏడు మండలాల్లోనూ ప్రచారం
మంగళవారం గట్టుప్పల్ మండలంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. అయితే వెల్మకన్నెలో రాజగోపాల్ రెడ్డి ప్రచారాన్ని కాంగ్రెస్ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. బీజేపీ సభలో కోమటిరెడ్డి ప్రసంగిస్తుండగా అక్కడికి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు.. బీజేపీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కాంట్రాక్టుల కోసం బీజేపీకి అమ్ముడుపోయి.. రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ కు మోసం చేశారని ఆరోపించారు. రాజగోపాల్ రెడ్డి గో బ్యాక్ అంటూ పెద్ద ఎత్తున స్లోగన్స్ చేశారు.దీంతో బీజేపీ సభ దగ్గర తీవ్ర ఉద్రిక్తత నెలొకంది. తనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలపై కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విరుచుకుపడ్డారు. పిచ్చి వేషాలు వేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సభను డిస్ట్రబ్ చేస్తున్న వాళ్లను తరిమివేయాలని పోలీసులను ఆదేశించారు. వెళ్లకపోతే బీజేపీ కార్యకర్తలు వచ్చి తంతారంటూ ఓపెన్ గానే వార్నింగ్ ఇచ్చారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.
Read More : బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ ఇచ్చిన హామీ ఇదే?
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సభల్లో కాంగ్రెస్ కార్యకర్తలు నినాదాలు చేయడంపై బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఎవరి ప్రచారం వాళ్లు చేసుకోవాలని కాని ఇలా అడ్డుకోవడం ఏంటని ప్రశ్నిస్తోంది. ఇదంతా కావాలనే పక్కా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారని రాజగోపాల్ రెడ్డి ఆరోపిస్తున్నారు. కొందరు యువకులు వేలాది రూపాయలు ఇస్తూ తమ సభల్లో అల్లర్లకు అధికార పార్టీ ప్లాన్ చేసిందని బీజేపీ నేతలు అంటున్నారు. మునుగోడులో టీఆర్ఎస్, కాంగ్రెస్ కలిసిపోయాయని.. బీజేపీని ఎలాగైనా ఓడించేందుకు కుట్రలు చేస్తున్నాయని మండిపడుతున్నారు. బీజేపీ సభలో రాజగోపాల్ రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తే 5 వేల రూపాయలు ఇస్తున్నారని కమలం నేతలు చెబుతున్నారు. ఇదంతా మంత్రి జగదీశ్ రెడ్డి డైరెక్షన్ లోనే జరుగుతుందని అంటున్నారు. కాంగ్రెస్ అభ్యర్థికి డబ్బులు కూడా టీఆర్ఎస్ నుంచే అందుతున్నాయని బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.
ఇవి కూడా చదవండి …
2 Comments