
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : మునుగోడు ఉప ఎన్నిక విషయంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. మునుగోడు కొత్త ఓటర్ల జాబితాపై దాఖలైన పిటిషన్ హై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణ తర్వాత మునుగోడులో 12 వేల కొత్త ఓటర్లకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఇంకా పెండింగులో ఉన్న ఓటర్ల విషయంలో వాయిదా వేయాలని కోరింది. మునుగోడు నియోజకవర్గంలో మొత్తం 25 వేల కొత్త ఓటర్ దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇప్పటివరకు 12 వేల ఓట్లకు ఈసీ అనుమతి ఇచ్చింది. 7 వేల దరఖాస్తులను తిరస్కరించింది.
మరో 6 వేల ఓట్ల దరఖాస్తులు ఇంకా పెండింగులో ఉన్నాయి. హైకోర్టు ఆదేశాలతో మునుగోడుకు సంబంధించి 12 వేలకు గ్రీన్ సిగ్నల్ రాగా.. మిగితావి పెండింగులో ఉండనున్నాయి. ఈ రోజు సాయంత్రం వరకు వచ్చిన దరఖాస్తుల వివరాలపై ఈనెల 21 వరకు నివేదిక ఇవ్వాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. తదుపరి విచారణకు ఈనెల 21కి వాయిదా వేసింది హైకోర్టు ధర్మాసనం.
Read More : బూర నర్సయ్య గౌడ్ కు బీజేపీ ఇచ్చిన హామీ ఇదే?
మునుగోడు ఉపఎన్నికను అన్ని పార్టీలు సవాల్ గా తీసుకున్నారు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామా చేస్తారని చాలా కాలంగా ప్రచారం సాగుతుండటంతో కొన్ని పార్టీలు ముందే అప్రమత్తమయ్యాయని తెలుస్తోంది. ఉప ఎన్నిక వస్తే లబ్ది పొందేలా అడ్డదారులు తొక్కాయనే విమర్శలు వస్తున్నాయు. ఈ నేపథ్యంలోనే కొత్తగా దొంగ ఓట్ల అంశం తెరపైకి వచ్చింది. గత రెండు నెలల్లోనే మునుగోడు నియోజకవర్గం పరిధిలో దాదాపు 25 వేల కొత్త ఓటర్లు దరఖాస్తు చేసుకున్నారు. గతంలో ఎప్పుడు ఇలాంటి పరిస్థితులు లేవంటున్నారు. కేవలం రెండు నెలల్లోనే ఏకంగా 25 వేల కొత్త దరఖాస్తులు రావడంతో.. భారీగా బోగస్ ఓటర్లను నమోదు చేయించారనే అనుమానాలు వస్తున్నాయి.ఇతర నియోజకవర్గాలకు చెందిన వాళ్లతో మునుగోడులో ఓటుకు దరఖాస్తు చేయించారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉప ఎన్నికలో డబ్బులు భారీగా ఇస్తారనే ఆశతో కొందరు ఇతర ప్రాంతాలకు చెందిన వారు మునుగోడులో దరఖాస్తు చేసుకున్నారని తెలుస్తోంది.
Read More : బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్.. జగదీశ్ రెడ్డే టీఆర్ఎస్ కు శాపమా?
మునుగోడులో తమకు పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో అధికార పార్టీ అక్రమాలకు పాల్పడిందని.. భారీగా దొంగ ఓట్లు నమోదు చేయించిందని బీజేపీ ఆరోపిస్తోంది. మునుగోడులో టీఆర్ఎస్ కుట్ర పూరితంగా దొంగ ఓట్లను నమోదు చేయించిందని ఈసీకి ఫిర్యాదు చేసింది తెలంగాణ బీజేపీ. దొంగ ఓటర్ల విషయంలో న్యాయపోరాటానికి దిగింది. కొత్త ఓటర్ల జాబితా ప్రకటనపై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించింది. కేవలం రెండు నెలల్లో సుమారు 25వేల కొత్త ఓటర్ల దరఖాస్తులను ఎన్నికల సంఘం స్వీకరించడంపై అభ్యంతరాలను వ్యక్తం చేసింది. జూలై 31 వరకు ఉన్న ఓటర్ల జాబితాతోనే ఉపఎన్నిక నిర్వహించాలని కోరింది. ఈ పిటిషన్ పైనే విచారణ జరిపిన హైకోర్టు.. తాజా ఆదేశాలు జారీ చేసింది.
ఇవి కూడా చదవండి …
One Comment