
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉప ఎన్నికలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. అధికార టీఆర్ఎస్ పార్టీకి దిమ్మతిరిగే షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ కారు దిగి కమలం గూటికి చేరుతున్నారు. గురువారం జరిగిన కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి నామినేషన్ కార్యక్రమానికి హాజరయ్యారు బూర. మంత్రి కేటీఆర్ తో కలిసి హైదరాబాద్ నుంచి వచ్చారు. దీంతో కొంత కాలంగా పార్టీ అసంతృప్తిగా ఉన్న బూర కూల్ అయ్యారని అంతా అనుకున్నారు. కూసుకుంట్ల గెలుపు కోసం ప్రచారం చేస్తారని బావించారు. కాని కూసుకుంట్ల నామినేషన్ వేసిన కొన్ని గంటల్లోనే సీన్ మారిపోయింది. కేటీఆర్ తో కలిసి చండూరు వెళ్లిన బూర.. హైదరాబాద్ తిరిగి రాగానే పార్టీ మార్పుపై నిర్ణయం తీసుకున్నారని తెలుస్తోంది. గురువారం రాత్రే బీజేపీ పెద్దలతో చర్చలు జరిపారని.. శుక్రవారం ఉదయమే హస్తినకు వెళ్లారని సమాచారం.
Read More : మునుగోడులో బీజేపీ గెలుపుపై కమలం నేతల్లో పెరిగిన ధీమా…
బూర నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరడం వెనుక శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్ కీలక పాత్ర పోషించారని తెలుస్తోంది. బీజేపీ పెద్దలతో మాట్లాడి బూరకు స్పష్టమైన హామీ ఇప్పించారని సమాచారం. 2014లో బువనగిరి ఎంపీగా పోటీ చేసిన బూర… కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై సంచలన విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో మాత్రం కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. అయితే బూర సొంతూరు మాత్రం సూర్యాపేట నియోజకవర్గంలో ఉంది. 2014 ఎన్నికల్లోనే సూర్యాపేట నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని బూర ప్రయత్నించినా.. జగదీశ్ రెడ్డి ఉండటంతో ఎంపీగా అవకాశం కల్పించారు సీఎం కేసీఆర్. అప్పటి నుంచే బూర, జగదీశ్ రెడ్డి మద్య గ్యాప్ ఉందంటు్ననారు. అయితే వచ్చే ఎన్నికల్లో సూర్యాపేట నుంచి బీజేపీ అసెంబ్లీ టికెట్ ఇవ్వడానికి హైకమాండ్ హామీ ఇచ్చిందని తెలుస్తోంది.
Read More : మునుగోడులో కారుకు కమ్యూనిస్టుల ఓట్లు కష్టమే!
సూర్యాపేటలో బీసీ వర్గాలు బలంగా ఉన్నాయి. బీసీ వాదం బలంగా ఉంది. గతంలో దర్మబిక్షం సూర్యాపేట నుంచి మొదటగా చట్టసబలోకి ఎన్నికయ్యారు. నియోజకవర్గంలో గౌడ్, యాదవ సామాజిక వర్గాలు ఎక్కువగా ఉన్నాయి. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బూరకు సూర్యాపేట అసెంబ్లీ టికెట్ ఇచ్చేలా బీజేపీ హైకమాండ్ స్పష్టమైన హామీ ఇచ్చిందని తెలుస్తోంది. మంత్రి జగదీశ్ రెడ్డిని టార్గెట్ చేస్తున్న బీజేపీ.. బూరతో బీసీ వాదంతో చెక్ పెట్టాలని చూస్తోందని సమాచారం. మొత్తంగా బూర బీజేపీలో చేరితే ఉమ్మడి నల్గొండ జిల్లాలో కమలం పార్టీకి బూస్ట్ రావడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
ఇవి కూడా చదవండి …
- బీజేపీలోకి బూర నర్సయ్య గౌడ్.. జగదీశ్ రెడ్డే టీఆర్ఎస్ కు శాపమా?
- మునుగోడులో 12వేల కొత్త ఓట్లు.. బోగస్ ఓటర్లతో ఎవరికి గండం?
- మర్రిగూడ మండలంలో 40 ఎకరాలు ఆక్రమించిన కూసుకుంట్ల…!
- ప్రజాక్షేత్రంలో చూసుకుందాం…. కేటిఆర్ కు ఈటల సవాల్
- డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి! మునుగోడులో మార్మోగుతున్న నినాదం
One Comment