
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్న మునుగోడు ఉప ఎన్నికలో సంచలనం జరగనుందని తెలుస్తోంది. నామినేషన్ల పర్వం ముగిసిన వేళ అధికార టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగలింది. టీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్. తెలంగాణ రాష్ట్ర సమితికి ఆయన గుడ్ బై చెప్పనున్నారు. త్వరలో నర్సయ్య గౌడ్ బీజేపీలో చేరే అవకాశాలు వున్నాయని తెలుస్తోంది దీనిపై ఆయన అధికారికంగా ప్రకటించాల్సి వుంది. గత నాలుగు రోజులుగా బూరతో బీజేపీ పెద్దలు మంతనాలు సాగిస్తున్నారని తెలుస్తోంది. అవి కొలిక్కి రావడంతో బూర డిల్లీకి వెళ్లారని అంటున్నారు. పార్టీలో మంచి గుర్తింపు ఇస్తామని బూరకు బీజేపీ పెద్దలు మాట ఇచ్చారని సమాచారం.
మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ టికెట్ తమకు కేటాయించాలని నర్సయ్య గౌడ్, కర్నే ప్రభాకర్ తీవ్రంగా ప్రయత్నించారు. అధిష్టానం స్థాయిలో లాబీయింగ్ చేశారు. అయినప్పటికీ.. సామాజిక సమీకరణలు, విధేయత, అంగ, అర్ధబలాన్ని పరిగణనలోనికి తీసుకున్న కేసీఆర్.. మునుగోడు టికెట్‌ను కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికే అప్పగించారు. కూసుకుంట్ల అభ్యర్ధిత్వం ఖరారు చేసిన వెంటనే కర్నే ప్రభాకర్ , బూర నర్సయ్య గౌడ్‌లను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు కేసీఆర్.
అనంతరం మాట్లాడిన బూరయయ మునుగోడు అభివృద్ధి కోసం కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించాలన్నారు. టికెట్ ఆశించడం తప్పు కాదని.. తన అవసరం జాతీయ రాజకీయాల్లో వుంటుందని కేసీఆర్ అన్నారని తెలిపారు. కేసీఆర్ ఆదేశాలు పాటిస్తానని నర్సయ్యగౌడ్ స్పష్టం చేశారు.మునుగోడు టీఆర్ఎస్‌లో అసంతృప్తి లేదన్నారు. అధినేత ఏ నిర్ణయం తీసుకున్నా పార్టీ బలోపేతం కోసమేనని కర్నె చెప్పారు. కూసుకుంట్లను భారీ మెజారిటీతో గెలిపిస్తామని చెప్పారు.
Read More : సార్ అనుకున్నదొకటి.. జరుగుతుంది మరొకటి! మునుగోడులో కారుకు కష్టమేనా?
అయితే బూర నర్సయ్య గౌడ్ కు సీఎంతో మంచి సంబందాలు ఉన్న జిల్లా మంత్రి జగదీశ్ రెడ్డి తీరుపైనే బూర గుర్రుగా ఉన్నారని తెలుస్తోంది. ముఖ్యంగా గత రెండు నెలలుగా మునుగోడులోనే తిరుగుతున్న జగదీశ్ రెడ్డి… బూరను మాత్రం పట్టించుకోలేదు. పార్టీ సమావేశాలకు పిలవలేదు. పార్టీ సమావేశాలకు తనకు పిలుపు రావడం లేదని ప్రెస్ మీట్ పెట్టి మరీ బూర చెప్పినా.. మంత్రి తీరు మాత్రం మారలేదు. మండలాల వారీగా నిర్వహించిన అత్మీయ సమావేశాలకు బూరను పిలవలేదు. దీంతో మంత్రి తీరుపై ఓపెన్ గానే బూర ఫైరయ్యారు. కొందరు అహంకారపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.
అహంకారం ఎప్పటికి చేటు తెస్తుందని చెప్పారు. అయినా బూర విషయంలో మంత్రి తీరు మారలేదు. కూసుకుంట్ల అభ్యర్ధిత్వం ఖరారు చేసిన వెంటనే కర్నే ప్రభాకర్ , బూర నర్సయ్య గౌడ్‌లను ప్రగతి భవన్‌కు పిలిపించి మాట్లాడారు కేసీఆర్.అయితే తన విషయంలో జగదీశ్ రెడ్డి వ్యవహరించిన తీరు బూర మర్చిపోలేకపోతున్నారని.. తనను అవమానించారనే బావనలోఉన్నారంటున్నారు. అందుకే పార్టీ మారాలని నిర్ణయించుకున్నారని చెబుతున్నారు. మొత్తంగా మంత్రి జగదీశ్ రెడ్డి తీరు మునుగోడు కారు పార్టీకి శాపంగా మారిందనే టాక్ వస్తోంది.
ఇవి కూడా చదవండి..
2 Comments