
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : ఉప ఎన్నికల హడావుడితో మునుగోడు నియోజకవర్గంలో పండగ వాతావరణం నెలకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా రాష్ట్ర స్థాయి రాజకీయ నాయకులందరూ మునుగోడు గ్రామాల్లోనే తిష్టవేశారు. గ్రామాల్లో కలియ తిరుగుతూ ఓటర్లను తమవైపునకు తిప్పుకునేందుకు ప్రయత్నాలు మొదలెట్టారు. మంత్రి మల్లారెడ్డి ఓటర్లకు మందు దావత్ ఇస్తున్న ఫొటోలు బయటకు వచ్చి వైరల్‌గా మారాయి. తెలుగు రాష్ట్రాల్లో ఓ రెండు రోజుల పాటు ఇదే హాట్ టాఫిక్‌గా మారిన విషయం తెలిసిందే.
Read More : సార్ అనుకున్నదొకటి.. జరుగుతుంది మరొకటి! మునుగోడులో కారుకు కష్టమేనా?
మద్యం, డబ్బుతో ఓటర్లను కొనాలన్న టీఆర్ఎస్ పాచిక మునుగోడులో సాగదంటున్నారు బీజేపీ నాయకులు. రాజగోపాల్‌రెడ్డిపై వ్యక్తిగత విమర్శల దాడి, అసత్య ప్రచారాలు ప్రజలు గమనిస్తున్నారని, ఇదే ఆయన గెలుపునకు నాంది పలుకుతుందంటున్నారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు స్వయంగా మంత్రులే విందు రాజకీయాలు చేయడం సిగ్గుచేటని ఎదురుదాడికి దిగుతున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు తమ స్థాయిని దిగజార్చుకుంటున్నారని ఎద్దేవా చేస్తున్నారు. మునుగోడులో మంత్రులు, ఎమ్మెల్యేల స్థాయిని కేసీఆర్ దిగజార్చారని, కావలికారులుగా మార్చారని బీజేపీ నేతలు మండిపడుతున్నారు. కేసీఆర్ చెప్పినట్టు చేస్తూ మరమనుషులుగా తయారవ్వద్దని హితవు పలుకుతున్నారు. మునుగోడు ప్రజలు ప్రలోభాలకు లొంగరని, టీఆర్ ఎస్‌కు కర్రకాల్చి వాతపెట్టడం ఖాయమని చెబుతున్నారు.
గ్రామాల్లో బీజేపీకి బ్రహ్మరథం : మునుగోడు నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో బీజేపీకి ప్రజలు బ్రహ్మరథం పడుతున్నాని, వ్యక్తిగతంగా రాజగోపాల్‌రెడ్డి చరిష్మా, ఆయనుకున్న మంచి పేరు ఉండటం, చేసిన సేవా కార్యక్రమాలు ప్రజలను ఉత్తేజితులను చేస్తున్నాయి. ఏ వ్యక్తిని కదిలించినా రాజగోపాల్‌రెడ్డి గెలుపు ఖాయమనే సంకేతాలు వెలువడుతున్నాయని బీజేపీ నేతలు చెబుతున్నారు. ఈసారి కేసీఆర్‌ను కొడితే అహంకారాన్ని కొట్టినట్టని, ధర్మాన్ని గెలిపించినట్టని హితబోధ చేస్తున్నారు.
Read More : గద్దర్ పోటీతో గులాబీ పార్టీలో కలవరం.. ఎందుకో తెలుసా?
బీజేపీని గెలిపించేందుకు, రాజగోపాల్‌రెడ్డిని విజయతీరాలకు చేర్చేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారని, నవంబర్ 3న విజయోత్సవాలు చేసుకునేందుకు సిద్ధమవ్వాలని శ్రేణులకు భరోసానిస్తున్నారు. సర్వే రిపోర్టులకు అందనంత గొప్పగా రాజగోపాల్‌రెడ్డి విజయం ఉంటుందని బల్లగుద్ది చెబుతున్నారు. రాజగోపాల్‌రెడ్డికి బీజేపీ వేల కోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిందని మంత్రులతో, ఎమ్మెల్యేలతో థర్డ్ క్లాస్ ప్రచారం చేయిస్తుండటం దుర్మార్గమని, ఈ కల్చర్, ఆనవాయితీ టీఆర్ ఎస్‌కు ఉందని నొక్కి వక్కానిస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి కుటుంబం మొదటి నుంచి కాంట్రాక్టులు చేస్తోందని, తెలంగాణ ఉద్యమం సమయంలో కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని చెబుతున్నారు.
ఈటల రాజేందర్, బీజేపీ ఎమ్మెల్యే : మునుగోడు ప్రజలను బోల్తా కొట్టించాలని కేసీఆర్ చూస్తున్నారు. ఓటుకు రూ.50వేలు, లక్ష ఇచ్చి కొనాలనుకుంటున్నారు. గ్రామాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు అడ్డాలు ఏర్పాటు చేసుకొని ప్రజలకు దావత్‌లు ఇస్తూ రాజకీయాలను నీచస్థాయికి దిగజార్చుతున్నారు. మంత్రి పదవికి ఉన్న గొప్పతనాన్ని మట్టిలో కలిపారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు. హుజూరాబాద్ మాదిరిగానే మునుగోడులో టీఆర్ఎస్‌కు చెంప చెల్లుమనడం ఖాయం.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో కారుకు కమ్యూనిస్టుల ఓట్లు కష్టమే!
- మూడు హత్యలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి! మునుగోడులో కలకలం…
- చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు.. కోమటిరెడ్డి పోస్టర్లు వెలిసిన గంటల్లోనే ఘటన..
- కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్
- మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఎర్ర గులాబీలు
2 Comments