
నల్లగొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): మునుగోడు ఉప ఎన్నికలో అన్ని పార్టీలు ప్రచారాన్ని ఉధృతం చేశాయి. ప్రధాన పార్టీల నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. అధికార పార్టీకి చెందిన 14 మంది మంత్రులు.. 76 మంది ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు జోరుగా ప్రచారం చేస్తున్నారు. బీజేపీ పార్టీ కి మద్దతుగా ఆ పార్టీ నేతలంతా తరలివచ్చారు. పీసీసీ ముఖ్యనేతలు మునుగోడులోనే మోహరించారు. ప్రచారంలో భాగంగా నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. వ్యక్తిగత దూషణలకు దిగుతున్నారు. పరస్పర సవాళ్లు చేసుకుంటున్నారు.
Read More : ప్రజాక్షేత్రంలో చూసుకుందాం…. కేటిఆర్ కు ఈటల సవాల్
చౌటుప్పల్ మండలంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ తో కలిసి ప్రచారం చేశారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ పై ఈటల తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ దిగజారిపోయి మాట్లాడుతున్నారని అన్నారు. తండ్రి బాటలోనే కేటీఆర్ నడుస్తున్నారని చెప్పారు. కుటుంబ పాలన మీద సమాధానం చెప్పలేక చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఈటల మండిపడ్డారు. టీఆర్ఎస్ రాక ముందే రాజగోపాల్ రెడ్డి బడా కాంట్రాక్టర్ అని.. ఉద్యమ సమయంలో కేసీఆర్ కు డబ్బుల సాయం కూడా చేశారని చెప్పారు. టెండర్లలో కాంట్రాక్ట్ వస్తే రాద్దాంతం చేయడం ఏంటన్నారు. తెలంగాణలో కాంట్రాక్టులను టెండర్లు లేకుండానే అప్పగిస్తున్నారా…అలా చేయడం సాధ్యమేనా అని రాజేందర్ ప్రశ్నించారు. కాంట్రాక్ట్ విషయంలో తడి బట్టలతో వచ్చి యాదగిరిగుట్ట ఆలయంలో ప్రమాణం చేయడానికి రాజగోపాల్ రెడ్డి సిద్ధమని.. అందుకు కేసీఆర్ , కేటీఆర్ సిద్ధమా అని సవాల్ చేశారు. అబద్దాలతో తెలంగాణ ప్రజలకు ఇంకా కేసీఆర్ మోసం చేయలేరన్నారు.
Read More : డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి! మునుగోడులో మార్మోగుతున్న నినాదం
ఉప ఎన్నికలు వస్తేనే ముఖ్యమంత్రి నిధులు ఇస్తారని తెలంగాణ ప్రజలందరికి తెలిసిపోయిందన్నారు రాజేందర్. మునుగోడులో అన్ని గ్రామాలను దావత్ లకు అడ్డాగా మార్చారని మండిపడ్డారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజలకు మంచి జరుగుతుందన్నారు. ఓటమి ఖాయమని తేలడంతో వ్యక్తిగత విమర్శలు చేయిస్తూ, చిల్లర రాజకీయం చేస్తున్నారని ఈటల ధ్వజమెత్తారు. మర్రిగూడ మండలంలో 40 ఎకరాల భూమిని టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి.. ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఆక్రమించుకున్నారని రాజేందర్ ఆరోపించారు. ముఖ్యమంత్రి బెదిరింపులతో భూ యజమానులు లొంగిపోయారని అన్నారు. మునుగోడు పోరు కేసీఆర్ కు గుణపాఠం కావాలన్నారు. కేసీఆర్ దోపిడీ పాలనకు చరమగీతం పాడటానికి మునుగోడులో బీజేపీని గెలిపించాలని ఓటర్లను కోరారు ఈటల రాజేందర్.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో బీజేపీ గెలుపుపై కమలం నేతల్లో పెరిగిన ధీమా…
- మునుగోడులో కారుకు కమ్యూనిస్టుల ఓట్లు కష్టమే!
- మూడు హత్యలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి! మునుగోడులో కలకలం…
- చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు.. కోమటిరెడ్డి పోస్టర్లు వెలిసిన గంటల్లోనే ఘటన..
- కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్
3 Comments