
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు సీఎం హోదాలో ఉండి జుగుప్సాకరమైన భాష వాడుతున్నారని, మంత్రి కేటీఆర్ ఉన్నత చదువులు చదువుకున్నప్పటికి విజ్ఞత కోల్పోయి వ్యవహరిస్తున్నారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ధ్వజమెత్తారు.కేటీఆర్ అలాంటి భాష వాడడం బాధాకరమని, తండ్రి బాటలో నడుస్తున్నాడని ఎద్దేవా చేసారు. కుటుంబ పాలన మీద సమాధానం చెప్పలేక చిల్లర ఆరోపణలు చేస్తున్నారని ఈటల విరుచుకుపడ్డారు.
Read Also : డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి! మునుగోడులో మార్మోగుతున్న నినాదం
రాజగోపాల్ రెడ్డి టీఆరెఎస్ పుట్టకముందే కాంట్రాక్టర్ అనే విషయాన్ని సీఎం, ఆయన తనయుడు కేటీఆర్ మర్చిపోయారని ఈటల రాజేందర్ తెలిపారు. ప్రజా క్షేత్రంలో తేల్చుకునేందుకు సిద్దంగా ఉండాలని, సోషల్ మీడియాలో దొంగ అకౌంట్స్ తెరిచి మోసం చేయడం, తిమ్మిని బమ్మి చేయడం చంద్రశేఖర్ రావుకు అలవాటని, కానీ ఇంకా నమ్మడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా లేరని ఈటల తెలిపారు. ఉప ఎన్నికలు వస్తేనే సీఎం వరాల జల్లు కురిపిస్తాడని అందరికీ తెలిసిపోయిందని, ఊర్లకు ఊర్లు దావత్ లకు అడ్డాగా మారుస్తున్నారని ఎద్దేవా చేసారు.
Read Also : మునుగోడులో బీజేపీ గెలుపుపై కమలం నేతల్లో పెరిగిన ధీమా…
అందుకే ఉప ఎన్నిక రావాలి అని అన్ని నియోజకవర్గాల ప్రజలు కోరుకుంటున్నారని ఈటల అన్నారు. రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ప్రజలు బాగుపడబోతున్నారని, మునుగొడు లోని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి క్యాంప్ కార్యాలయంలో మాట్లాడారు. అంతే కాకుండా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి దేశవ్యాప్తంగా కాంట్రాక్టులు చేస్తున్నారని, ఇప్పుడు 18 వేల కోట్ల కాంట్రాక్ట్ అంటూ సీఎం ఆయన కుమారుడు ఆరోపణలు చేస్తున్నారని, తెలంగాణలో కూడా అలాగే కాంట్రాక్టులను అప్పగిస్తున్నారా?అని ఈటల ప్రశ్నించారు.
Read More : మునుగోడులో కారుకు కమ్యూనిస్టుల ఓట్లు కష్టమే!
పచ్చకామెర్ల వారికి లోకమంతా పచ్చ కామెర్లు అన్నట్టు వారు చేసే పనులు అందరూ చేస్తున్నారా? అని ముఖ్యమంత్రిని నిలదీసారు. నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ వచ్చిందని, ఈ అంశంపై యాదగిరిగుట్ట టెంపుల్ కి తడి బట్టలతో వస్తా దమ్ముంటే రావాలని సీఎంకు రాజగోపాల్ రెడ్డి సవాలు విసిరిని మర్చిపోవద్దన్నారు ఈటల.చిత్తశుద్ది ఉంటే ఆ సవాలు స్వీకరించాలని, చంద్రశేఖర్ రావు కు ఏమీ లేనప్పుడు తెలంగాణ ఉద్యమం కోసం సాయం చేసిన వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అని ఈటల స్పష్టం చేసారు.
ఇవి కూడా చదవండి …
- మూడు హత్యలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి! మునుగోడులో కలకలం…
- చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు.. కోమటిరెడ్డి పోస్టర్లు వెలిసిన గంటల్లోనే ఘటన..
- కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్
- మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఎర్ర గులాబీలు
- కోమటిరెడ్డి నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన యువకులు.
3 Comments