
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఇది తెలుగు రాష్ట్రాల్లో చాలా ఫేమస్ పదం. ఓ ప్రముఖ జ్యూవెలరీ షాపు ప్రచారంలో ఇది వినిపిస్తుంది. డబ్బులు ఊరికే రావు అన్న స్లోగన్ ఆ సంస్థకు మంచి పేరు తెచ్చి పెట్టింది. ఈ నినాదం ఇప్పుడు మునుగోడు నియోజకవర్గంలో మార్మోగుతోంది.ఉప ఎన్నికలో గెలుపే లక్ష్యంగా ప్రధాన పార్టీలు పోటాపోటీ వ్యూహాలు రచిస్తున్నాయి. మునుగోడు నియోజకవర్గంలో డబ్బులను విచ్చలవడిగా ఖర్చు చేస్తున్నారు. ఓటర్లను కొనుగోలు చేస్తున్నారు. ఎక్కడిక్కకడ ప్యాకేజీలు మాట్లాడుతూ గంపగుత్తగా కొనేస్తున్నారు. మునుగోడులో జరుగుతున్న పరిణామాలతో డబ్బులు ఎవరికి ఊరికే రావు… ఉప ఎన్నిక వస్తేనే వస్తాయి అంటూ కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి అన్న పదం మునుగోడు నియోజకవర్గంలో వాట్సాప్ స్టేటస్ గా మారిపోయింది.
Read More : సార్ అనుకున్నదొకటి.. జరుగుతుంది మరొకటి! మునుగోడులో కారుకు కష్టమేనా?
మునుగోడు ఉప ఎన్నికను ప్రధాన పార్టీలు సవాల్ గా తీసుకున్నాయి. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సెమీఫైనల్ గా భావిస్తుండటంతో ఎలాగైనా గెలిచేందుకు వ్యూహాలు రచిస్తున్నాయి. అన్ని పార్టీల నేతలంతా మునుగోడులోనే మకాం వేశారు. అధికార టీఆర్ఎస్ పార్టీ ఏకంగా 14 మంది మంత్రులు, 76 మంది ఎమ్మెల్యేలను రంగంలోకి దింపింది. ఒక్కో ఎంపీటీసీ స్థానానికి మంత్రిని ఇంచార్జుగా నియమించింది. బీజేపీ ప్రచారం కోసం కేంద్రమంత్రులు వస్తున్నారు. తెలంగాణ బీజేపీ ముఖ్య నేతలంతా మునుగోడులోనే తిరుగుతన్నారు. తమ సిట్టింగ్ సీటును నిలబెట్టుకోవాలనే కసితో టీపీసీసీ నేతలంతా శ్రమిస్తున్నారు. ఇలా అన్ని పార్టీలు మునుగోడు బైపోల్ కోసం ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోకుండా ప్రచారం చేస్తున్నారు. మునుగోడు ఓటర్లకు హామీలపై హామీలు గుప్పిస్తున్నారు.
Read More : గద్దర్ పోటీతో గులాబీ పార్టీలో కలవరం.. ఎందుకో తెలుసా?
పోలింగ్ ఇంకా 20 రోజుల సమయం ఉండగానే మునుగోడులో ఓట్లర్లను కొనేస్తున్నాయి పార్టీలు. అడిగిన వారికి అడగని వారికి అన్నట్టుగా డబ్బులు కుమ్మరిస్తున్నారు. ఇప్పటివరకు అభివృద్ధికి కూడా పైసలు లేవన్న అధికార పార్టీ భారీగా నిధులు ఖర్చు చేస్తోంది. అన్ని పార్టీలు పోటీ పడి మరీ ఓటర్లకు వేలకు వేలు పంచేస్తున్నాయి. ఓటుకు ఎంతైనా ఇచ్చే పరిస్థితి కనిపిస్తోంది. పోలింగ్ నాటికి మరింతగా డబ్బుల పంపకం ఉండవచ్చంటున్నారు. ఈ నేపథ్యంలోనే డబ్బులు ఎవరికి ఊరికే రావు.. ఉప ఎన్నిక వస్తే వస్తాయి అనే స్లోగన్ మార్మోగుతోంది. దీన్ని స్టేటస్ గా పెట్టుకుని ఎంజాయ్ చేస్తున్నారు మునుగోడు యువకులు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడులో బీజేపీ గెలుపుపై కమలం నేతల్లో పెరిగిన ధీమా…
- మునుగోడులో కారుకు కమ్యూనిస్టుల ఓట్లు కష్టమే!
- మూడు హత్యలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి! మునుగోడులో కలకలం…
- చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు.. కోమటిరెడ్డి పోస్టర్లు వెలిసిన గంటల్లోనే ఘటన..
- కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్
3 Comments