
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : మునుగోడు ఉపసమరంలో అనూహ్య పరిణామాలు జరుగుతున్నాయి. హోరాహోరీ పోరు సాగుతుండటంతో ఉద్రిక్తతలు తలెత్తున్నాయి. నేతల మద్య వ్యక్తిగత మాటలు హద్దులు దాటుతున్నాయి. మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై చేసిన వ్యాఖ్యలకు క్షమాపణ చెప్పకుంటే.. తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. కేటీఆర్ నీ భాష జాగ్రత్త.. నిజాయితీతో నిప్పులా బతికాను.. మీ కుటుంబంలా కమీషన్లతో కాదని వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. తమ గురించి మాట్లాడే ముందు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలంటూ కోమటిరెడ్డి వార్నింగ్ ఇచ్చారు.
Read More : నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
కేసీఆర్ కుటుంబం అవినీతి చిట్టా మొత్తం తన వద్ద ఉందని.. తన జోలికివస్తే అవినీతి చిట్టా మొత్తం విప్పుతానంటూ హెచ్చరించారు. కోమటిరెడ్డి కాదు.. కోవర్టు బ్రదర్స్ అంటూ మంత్రి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కేటీఆర్ వెంటనే తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని, బేషరతుగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చశారు. లేదంటే కేసీఆర్ కుటుంబం అవినీతిపై రోజూ మాట్లాడతానని అన్నారు.
Read More : మునుగోడులో కారుకు కమ్యూనిస్టుల ఓట్లు కష్టమే!
మునుగోడులో పోటీ రాజగోపాల్ రెడ్డితో అయితే తననెందుకు లాగుతున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తనలాంటి ఉద్యమకారుడిపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా? అంటూ కేటీఆర్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేసి పోరాడానని, తెలంగాణ ప్రజల కోసం నిరంతరం పోరాడుతున్నామని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. కాంట్రాక్టుల కోసమే అన్నదమ్ములు ఆటలాడుతున్నారంటూ కేటీఆర్ చేసిన ఆరోపణలను వెంకటరెడ్డి ఖండించారు. తాను ఇప్పటికీ కిరాయి ఇంట్లోనే ఉంటున్నానని చెప్పారు. కేటీఆర్ ఇష్టానుసారం మాట్లాడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ప్రతి రోజూ కేసీఆర్ ఫ్యామిలీ అవినీతిపై మాట్లాడతానన్నారు. కేటీఆర్‌లా తాను తండ్రి చాటుతో రాజకీయాల్లోకి రాలేదని వెంకటరెడ్డి అన్నారు.
Read More : సార్ అనుకున్నదొకటి.. జరుగుతుంది మరొకటి! మునుగోడులో కారుకు కష్టమేనా?
మంత్రి జగదీశ్ రెడ్డిపైనా కోమటిరెడ్డి వెంకటరెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగదీశ్ రెడ్డి ఓ హంతకుడని, ముగ్గురిని హత్య చేశాడని తెలిపారు. తన వద్ద వాటికి సంబంధించిన ఎఫ్ఐఆర్‌లు కూడా ఉన్నాయన్నారు. బస్సు ఛార్జీలకు డబ్బుల్లేని జగదీశ్ రెడ్డి.. ఈరోజు వేల కోట్లు ఎలా సంపాదించుకున్నారని ప్రశ్నించారు. ఆయన ఏమైనా వ్యాపారాలు చేశారా? ఎలా వేల కోట్లు ఆస్తులు వచ్చాయని నిలదీశారు. 70 ఎకరాల్లో మంత్రికి ఫాంహౌస్ ఉందన్నారు. పట్టుమని పది ఎకరాలు లేని కేటీఆర్ కు వేల కోట్ల ఆస్తులు ఎక్కడ్నుంచి వచ్చాయని కోమటిరెడ్డి ప్రశ్నించారు.కేటీఆర్ ఢిల్లీకి కోవర్టు కాదని.. చెప్పే దమ్ముందా? అని నిలదీశారు.
Read More : చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు.. కోమటిరెడ్డి పోస్టర్లు వెలిసిన గంటల్లోనే ఘటన..
ఢిల్లీకి కోవర్టువు కాకుంటే ఎప్పుడో జైల్లో ఊచలు లెక్కబెట్టేవారని అన్నారు. అవినీతి కుంభకోణాలకు కేటీఆర్ కోవర్టు అని విమర్శించారు. కేసీఆర్ కుటుంబమే కమీషన్ల కుటుంబమని ఆరోపించారు. కాళేశ్వరంతోపాటు ప్రతి ప్రాజెక్టులోనూ కల్వకుంట్ల ఫ్యామిలీకి కమీషన్లు వెళ్తున్న మాట నిజం కాదా ? అని ప్రశ్నించారు. కేటీఆర్ భాష, పద్ధతి బాగాలేదని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ చదివింది అమెరికాలోనా.. గుంటూరు గల్లీల్లోనా? అని ప్రశ్నించారు. అసలు తెలంగాణ ఎలా వచ్చిందో కేటీఆర్‌కు తెలుసా? అని నిలదీశారు.
ఇవి కూడా చదవండి …