
నల్గొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): మునుగోడు బై ఎలక్షన్ లో మిత్ర పక్షాలు బలపర్చిన టీ.ఆర్.ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి, మునుగోడు నియోజకవర్గ ఇంచార్జ్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి కి ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. మొదటగా మునుగోడు మండలం, కొరటికల్ గ్రామం నుండి ప్రచారం మొదలు పెట్టారు. గ్రామ ప్రజలంతా బతుకమ్మలు, బోనాలతో కోలాటాలు, డప్పు, వాయిద్యాలతో తెలంగాణ సాంసృతిని గుర్తుతెచ్చేలా ప్రదర్శనలు చేశారు. తెరాస, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తలు, ప్రజలతో కలిసి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ప్రచారంలో తెరాస పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రసంగించారు. ఉప ఎన్నికలో మరోసారి గెలిపిస్తే ఈ ప్రాంత ప్రజల ఋణం తీర్చుకుంటానని… రానున్న రోజుల్లో కలిసికట్టుగా పని చేస్తూ, ఆగిపోయిన పనులను పూర్తి చేసి అభివృద్ధి చేసుకుందామని అన్నారు.
Read More : మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు
తెలంగాణ రాష్ట్రంలో ఈ మునుగోడు నుంచే మత రాజకీయాలకు పాల్పడాలని, మన మధ్య ఉన్న అన్నదమ్ముల బంధాలను చెల్లాచెదురు చేసి ఆనంద పడాలని బీజేపీ పార్టీ చూస్తుంది జాగ్రత్త అని హెచ్చరించారు. లౌకిక వాదంతో బ్రతుకుతున్న మనలను విడగొట్టాలని చూస్తున్న బిజెపిని త్వరలోనే ప్రజలు తరిమికొట్టడం ఖాయమన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మునుగోడులో టిఆర్ఎస్ ఘన విజయం సాధించడం ఖరారని ధీమా వ్యక్తం చేశారు. అక్కలు, చెల్లెలు, అన్నలు తమ్ముళ్లు అందరికి చేతులు జోడించి నమస్కరించి అడుగుతున్న ప్రతి ఒక్కరూ కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని, మరోసారి అవకాశం ఇచ్చి, ఆశీర్వదించాలని వారు కోరారు.
Read More : కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
ఈ ప్రచారంలో ముఖ్య అతిధిగా పాల్గొన్న విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి బీజేపీ ప్రభుత్వం పై దుమ్మెత్తి పోసారు. మోటర్లకు మీటర్లు, గుదిబండగా మారిన గ్యాస్ కుండ, మండిపోతున్న చమురు చమత్కారం గురించి వివరించి చెప్పారు. ప్రజల అభివృద్ధి కోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన పథకాల వల్ల కొన్ని లక్షల మంది లబ్దిపొందారని, తెరాస ప్రభుత్వం వచ్చిన తరువాతనే మునుగోడును పట్టిపీడిస్తున్న ఫ్లోరైడ్ బూతం తరిమి కొట్టబడిందని వారన్నారు. షాదీ ముభారక్, కళ్యాణ లక్ష్మి, రైతు బంధు, రైతు బీమా, ఆసరా, వంటి పథకాల వల్ల ప్రజలు ఆర్థిక నష్టాల నుండి బయటపడుతున్నారని అన్నారు.
Read More : మునుగోడు బీసీ అభ్యర్థి ఎవరు? కేసీఆర్ ట్విస్ట్ ఇస్తారా?
ప్రాణాలకు తెగించి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో మతతత్వ బీజేపీకి చోటివ్వొద్దని ప్రజలను కోరారు. తెలంగాణ రాష్ట్రం మత ఘర్షణలతో చెలరేగిపోవద్దంటే బీజేపీ ని మునుగోడులోనే పాతరేయాలని ప్రసంగించారు. ఈ ప్రచారంలో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నల్గొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, సీపీఐ రాష్ట్ర నాయకులు పల్లా వెంకట్ రెడ్డి, మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …