
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణలో అత్యంత కీలకంగా మారిన మునుగోడు ఉపఎన్నికలో ప్రచారం జోరందుకుంది. అన్ని పార్టీలు ముమ్మరంగా ప్రచారం చేస్తున్నాయి. గెలుపు కోసం ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోకుండా ముందుకు సాగుతున్నాయి. మునుగోడు ఉప ఎన్నికలో కమ్యూనిస్టు పార్టీలు టీఆర్ఎస్ కు మద్దతు తెలిపాయి. కారుకు మద్దతుగా కమ్యూనిస్టుల పార్టీల అగ్రనేతలు మునుగోడులో ప్రచారం కూడా చేస్తున్నారు. అయితే అగ్ర నాయకత్వం మద్దతు ఇచ్చినా… స్థానిక సీపీఎం, సీపీఐ కేడర్ మాత్రం అదికార పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు కన్పించడం లేదని తెలుస్తోంది. టీర్ఎస్ పార్టీ నేతలతో కలిసి కమ్యూనిస్టు నేతలు ప్రచారం చేయడం లేదు.
Read More : సార్ అనుకున్నదొకటి.. జరుగుతుంది మరొకటి! మునుగోడులో కారుకు కష్టమేనా?
చండూరులో సీపీఎం, సీపీఐ కలిసి టీఆర్ఎస్ సభ నిర్వహించింది. ఈ సభలో టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని ఓ భూనిర్వాసితుడు నిలదీశాడు. కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రసంగం ముగియగానే రాంరెడ్డి పల్లికి చెందిన జంగయ్య చర్లగూడెం ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలను పరిష్కాలించాలని డిమాండ్ చేశారు. 25ఏండ్లుగా కమ్యూనిస్టు పార్టీలో ఉంటున్నామని.. తమ సమస్యను పరిష్కరిస్తేనే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి ఓటు వేస్తామని స్పష్టం చేశాడు. కమ్యూనిస్టులు మారలేదని.. కేసీఆరే కమ్యూనిస్టుల వైపు మారాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం చెప్పారు. కూసుకుంట్లను నిలదీసిన గటనతో మునుగోడు ఉప ఎన్నికల్లో కమ్యూనిస్టుల ఓట్లు కారు పార్టీకి పడటమే కష్టమే అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- చండూరు కాంగ్రెస్ కార్యాలయానికి నిప్పు.. కోమటిరెడ్డి పోస్టర్లు వెలిసిన గంటల్లోనే ఘటన..
- కారెక్కిన కర్నాటి.. అదే బాటలో తాడూరి! మునుగోడుపై ప్రగతి భవన్ నుంచి ఆపరేషన్
- మునుగోడు ఉపఎన్నికల ప్రచారంలో ఎర్ర గులాబీలు
- కోమటిరెడ్డి నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన యువకులు.
- గద్దర్ పోటీతో గులాబీ పార్టీలో కలవరం.. ఎందుకో తెలుసా?
One Comment