
నల్గొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో బిజెపి పార్టీ నుండి ఎమ్మెల్యేగా బరిలో దిగుతున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం నామినేషన్ వేశారు. నియోజకవర్గం పరిధిలోని ఏడు మండలాల నుండి దాదాపు 30 వేల పై చిలుకు ద్విచక్ర వాహనాలతో భారీ ర్యాలీ నిర్వహించారు. దాదాపు అరవై వేలకు పైగా ప్రజలు నామినేషన్ ప్రాంతం చండూరు తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. రానున్న ధర్మ యుద్ధంలో కోమటిరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని జేజేలు కొడుతూ ప్రజలు నినాదాలు ఇచ్చారు.
Read More : కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
నామినేషన్ ప్రాంతమంతా జనాలతో కిక్కిరిసిపోయింది, ఇందులో యువకులు అత్యధికంగా పాల్గొన్నారు. మునుగోడు ప్రాంత అభివృద్ధి కోసం, ప్రభుత్వంపై వ్యతిరేకతతో పదవి త్యాగం చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని తిరిగి మునుగోడు గడ్డపై ఎమ్మెల్యే గా నిలబెడుతామని యువకులు ధీమా వ్యక్తం చేశారు. నామినేషన్ ప్రక్రియ సందర్బంగా తరలి వచ్చిన ప్రజలను ఉద్దేశించి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రసంగించారు. తను ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం నిధులు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేశారని, కనీసం ముఖ్య మంత్రిని కలిసి మునుగోడు గోడును చెప్పే అవకాశం కూడా ఇవ్వలేదని అన్నారు.
తెరాస కుటుంబ పాలనకు చరమగీతం పాడాలంటే, మునుగోడు నుండే వారి పతనం మొదలవ్వాలని పిలుపునిచ్చారు. అందుకోసం ప్రతి కార్యకర్త జవాన్ ల పనిచెయ్యాలని, రాష్ట్రానికి పట్టిన ఫామ్ హౌస్ భూతాన్ని తరిమి కొట్టాలని అన్నారు. మర్రిగూడ మండల కేంద్రం నుండి కొడాల వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో దాదాపు మూడు వందల ద్విచక్ర వాహనాలు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా చండూర్ కి బయలుదేరాయి. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్, బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, వివేక్ లతో కలిసి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు సమర్పించారు.
ఇవి కూడా చదవండి …
- సార్ అనుకున్నదొకటి.. జరుగుతుంది మరొకటి! మునుగోడులో కారుకు కష్టమేనా?
- గద్దర్ పోటీతో గులాబీ పార్టీలో కలవరం.. ఎందుకో తెలుసా?
- మర్రిగూడ మండలంలో బిజెపికి కొడాల వెంకట్ రెడ్డి.
- 19 వందల ఓట్లకు ఇంచార్జ్ గా కేసీఆర్.. మునుగోడు టీఆర్ఎస్ లో అంత భయమెందుకు?
- మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు
3 Comments