
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : అనుకున్నది ఒక్కటి… అవుతున్నది ఒక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా.. మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాలతో ఇదే నిజమనిపిస్తోంది. మునుగోడు ఉప ఎన్నికను సవాల్ గా తీసుకున్న సీఎం కేసీఆర్.. మొత్తం 14 మంది మంత్రులు, 76 మంది ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలను రంగంలోకి దింపారు. నియోజకవర్గంలో మొత్తం 86 ఎంపీటీసీ స్థానాలు ఉండగా.. ఉపసమరం కోసం 86 క్లస్టర్లుగా కేటాయించారు. ప్రతి ఒక్క ఇంచార్జ్ గా ఒక్క ఎంపీటీసీ పరిది అన్నమాట. అంటే మంత్రులు కూడా ఒక్క ఎంపీటీసీ సీటుకు మాత్రమే పరిమితం. కేటీఆర్, హరీష్ రావు కూడా ఎంపీటీసీ వరకే ఇంచార్జ్ గా ఉన్నారు. గులాబీ బాస్ అదేశాలతో కారు పార్టీ నేతలంతా మునుగోడులో మకాం వేశారు. ఇంతవరకు బాగానే ఉంది.. కాని ా తర్వాతే అదికార పార్టీకి అసలు సమస్య వచ్చిందంటున్నారు.
Read More : కోమటిరెడ్డి నామినేషన్ కు భారీగా తరలి వెళ్లిన యువకులు.
ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఇంచార్జుగా ఉన్న మంత్రి, ఎంపీ, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు తమతో పాటు తమ నియోజకవర్గానికి చెందిన కీలక నేతలను వెంట తీసుకెళ్లారు. ఇంచార్జుల వెంట వెళ్లిన ఇతర నేతలే గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు. వందమంది ఓటర్లకు ఒకరు చొప్పున కేటాయించుకుని ప్రచారం చేస్తున్నారు. డబ్బుల పంపిణి కూడా వాళ్ల ద్వారానే జరగనుందట. ఇదే స్థానిక నేతల గుస్సాకు కారణమవుతోంది. ఒక్కో ఎమ్మెల్యే 20 నుంచి 50 మంది వరకు తమ నియోజకవర్గం వారినే నియమించుకున్నారు. వీరే ప్రచారంలో ప్రధాన భూమిక పోషిస్తున్నారు. దీంతో స్థానిక నేతలు కేవలంలో ప్రచారంలో పాల్గొంటున్నప్పటికీ ప్రాధాన్యం దక్కడం లేదని మండిపడుతున్నారు.
Read More : గద్దర్ పోటీతో గులాబీ పార్టీలో కలవరం.. ఎందుకో తెలుసా?
ఇతర నియోజకవర్గాల నుంచి వచ్చిన నేతలదే హవా నడుస్తోంది. స్థానిక నేతలు కేవలం ప్రచార బొమ్మలుగానే మారుతుండటంతో మనోవేదనకు గురవుతున్నారు. దీంతో లోకల్, నాన్ లోకల్ తేడా వచ్చి పరస్పర సహకారం కొరవడుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో నేతల మధ్య సహకారంలో లేకపోతే గెలుపోటములపై ప్రభావం పడే అవకాశం ఉంది.హుజూరాబాద్ బైపోల్ సమయంలోనూ టీఆర్ఎస్ ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్సీలతో పాటు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సైతం ప్రచారం చేశారు. స్థానిక నేతలకు ప్రాధాన్యం ఇవ్వలేదు. అన్ని తానై ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారే వ్యవహరించారు.
Read More : 19 వందల ఓట్లకు ఇంచార్జ్ గా కేసీఆర్.. మునుగోడు టీఆర్ఎస్ లో అంత భయమెందుకు?
దీంతో పార్టీ కేడర్‌తో పాటు ప్రజల్లోనూ వ్యతిరేకత వచ్చింది. ఇప్పుడు మునుగోడు బైపోల్‌లోనూ స్థానిక నేతలకు కాకుండా ఇతర ప్రాంతాలకు చెందిన వారికి బాధ్యతలు అప్పగించడంతో గ్రామస్థాయి నుంచి స్థానిక నేతలు అసంతృప్తితో ఉన్నారు. ఇలాగే పోలింగ్ వరకు కొనసాగితే హుజూరాబాద్ ఫలితాలే మునుగోడులోనూ రిపీట్ అయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఇవి కూడా చదవండి …
- మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు
- కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
- మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- మునుగోడు బీసీ అభ్యర్థి ఎవరు? కేసీఆర్ ట్విస్ట్ ఇస్తారా?
- దసరాకు ముందే వచ్చిన ఉప ఎన్నిక షెడ్యూల్… మునుగోడు జనాలకు జజ్జనకర జాతరే!
5 Comments