
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): నియోజకవర్గంలో కోమటిరెడ్డి హవా నడుస్తుంటే, మర్రిగూడ మండలం లో కొడాల వెంకట్ రెడ్డి హవా ఎక్కువగా నడుస్తుంది. తను చేసిన సేవా కార్యక్రమాలు ఈ బై ఎలక్షన్ లోకీ రోల్ గా మారాయి. ఒక్క మండల కేంద్రంలోనే కాకుండా మండల పరిధిలోని అన్ని గ్రామాల నందు కొడాల వెంకట్ రెడ్డికి ఫాలోవర్స్ కు కొదవే లేదు. గత కొన్ని రోజులుగా ఆయన ఆధ్వర్యంలో కాంగ్రెస్, తెరాస పార్టీల నుండి ప్రధాన నాయకులు, కార్యకర్తలు సైతం కమలం దారి పట్టారు. కరోనా సమయంలో చిన్నా పెద్ద అనే తేడా లేకుండా తన వంతు సాయంగా కొడాల చేయూత పొందిన వారే ఎక్కువ అని చెప్పడంలో అర్చర్యం లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గెలుపుకై అహర్నిశలు శ్రమిస్తున్న కొడాల వెంకట్ రెడ్డి, శనివారం దాదాపు అయిదు వందల మందితో పాటు బీజేపీ పార్టీలోకి చేరారు.
ఈ లెక్క ప్రకారం వట్టిపల్లి, రాజపేట తండా, కొండూరు గ్రామాల నందు గ్రామ పెద్దలు, వార్డు మెంబర్లు, క్రియాశీలక నేతలు, మహిళా ప్రతినిధులు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు… మండల కేంద్రంలోని భారతి గార్డెన్ నందు నిర్వహించిన బీజేపీ ఆహ్వాన కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఇంచార్జ్ లు కొండా విశ్వశ్వర్ రెడ్డి, తుల ఉమా పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనను మునుగోడు ప్రజలే బొంద పెడతారని, ఎమ్మెల్యే గా ఉన్నప్పుడు అభివృద్ధి నిధులు కేటాయించలేదని, ముఖ్య మంత్రి కనీసం కలవటానికి కూడా సమయం ఇవ్వలేదని కోమటిరెడ్డి ప్రసంగించారు. ఈ ధర్మ యుద్ధంలో ప్రజలు మల్లీ నన్ను గెలిపించాలని కోరారు.
తెరాస నుండి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి నాకు పోటీ కానే కాదని అన్నారు. పార్టీలో చేరిన వారిలో కాంగ్రెస్ పార్టీ మాజీ మహిళా మండల అధ్యక్షురాలు మెండు దీపా రెడ్డి, వట్టిపల్లి గ్రామ మూడో వార్డు మెంబర్ సలూవోజు సంధ్య భిక్షమాచారి, అయిదో వార్డు మెంబర్ బూరెల రమేష్, కుర్మ సంఘం నుండి నీల మహేష్, నీల యాదయ్య ఆధ్వర్యంలో 48 మంది కుల ప్రజలు బీజేపీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. తెరాస పార్టీ నాయకులు చెప్పుడు మాటలు వింటూ, సొంత పార్టీ నేతలను దూరం పెట్టడం కూడా పార్టీ మార్పులు జరుగుతున్నాయని ప్రజలు అనుకుంటున్నారు. ఈ మూడు గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ,తెరాస పార్టీ సీనియర్ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పార్టీలో జాయిన్ అయ్యారు.
ఇవి కూడా చదవండి ….
- 19 వందల ఓట్లకు ఇంచార్జ్ గా కేసీఆర్.. మునుగోడు టీఆర్ఎస్ లో అంత భయమెందుకు?
- మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు
- మునుగోడులో కమలానికి కదిలిపోతున్న యువత.
- కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
- మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి