HyderabadTelangana

గద్దర్ పోటీతో గులాబీ పార్టీలో కలవరం.. ఎందుకో తెలుసా?

క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : మునుగోడు ఉప సమరంలో రోజుకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది.మునుగోడులో పోటీ చేస్తానని గద్దర్ ప్రకటించడం సంచలనంగా మారింది. వామపక్ష ఉద్యమాల్లో ఉన్న గద్దర్.. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. బడుగు, బలహీన వర్గాల్లో ఆయనకు క్రేజీ ఉంటుంది. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ఓటర్లే 90 శాతం ఉన్న మునుగోడులో గద్దర్ పోటీ చేస్తుండటం ప్రధాన పార్టీలను కలవరపరుస్తోంది. మునుగోడులో గద్దర్ పోటీ చేస్తే ఎవరికి నష్టం, ఎవరికి లాభం.. ఆయనతో ఎవరి ఓట్లు చీలుతాయి.. ఎవరికి గండం అన్నదానిపై రకరకాల చర్చలు సాగుతున్నాయి.

Read More : తన పని అయిపోయిందన్న కేసీఆర్.. ఎందుకలా.. ఏం జరగబోతోంది?

దసరా రోజున కేఏ పాల్ సారథ్యంలోని ప్రజాశాంతి పార్టీలో చేరారు గద్దర్. మునుగోడు నుంచి పోటీ చేస్తానని ప్రకటించారు. మునుగోడులో టీజేఎస్ బరిలో ఉంటుందని కోదండరామ్ ప్రకటించాకా గద్దర్ మాట మార్చారు. మునుగోడులో పోటీ చేయడం ఖాయమని.. అయితే ఏ పార్టీ నుంచి అన్నది ఇంకా ఫైనల్ కాలేదని చెప్పారు. ఆదివారం టీజేఎస్ అధ్యక్షుడు కోదండరామ్ తో సమావేశమయ్యారు. దీంతో గద్దర్ ప్రజాశాంతి పార్టీ నుంచి కాకుండా టీజేఎస్ అభ్యర్థిగా మునుగోడు బరిలో ఉండనున్నారా అన్న చర్చ సాగుతోంది. లేదు ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తారని.. అయితే టీజేఎస్ మద్దతు కోరారని కొందరు చెబుతున్నారు. దాదాపు నాలుగు దశాబ్ధాలపాటు ఎన్నికల ప్రక్రియను తిరస్కరిస్తూ వచ్చిన గద్దర్.. ఇప్పుడు ఎన్నికలో పోటీ చేయడానికి సిద్ధం కావడమే సంచలనమైతే.. ఆయన పోటీతో మునుగోడులో ఏం జరగనుందన్నది మరింత ఆసక్తికరంగా మారింది.

Read More : మునుగోడు అసమ్మతి నేతల రహస్య సమావేశం.. మంత్రి జగదీశ్ రెడ్డే టార్గెట్? 

వామపక్ష ఉద్యమాల్లో ఉన్న గద్దర్ కు లెఫ్ట్ పార్టీల్లో మంచి క్రేజీ ఉంది. మునుగోడు ఉప ఎన్నికలో సీపీఎం, సీపీఐ పార్టీలు అధికార టీఆర్ఎస్ పార్టీకి మద్దతు ఇచ్చాయి. బీజేపీని ఓడించడమే తమ లక్ష్యమని ప్రకటించాయి. గద్దర్ పోటీ చేస్తే కమ్యూనిస్టుల ఓట్లు చీలడం ఖాయంగా తెలుస్తోంది. టీఆర్ఎస్ తో పాటు గద్దర్ కు వామపక్షఓటు బ్యాంక్ చీలుతుందని అంచనా వేస్తున్నారు. ఇది గులాబీ పార్టీకి గండమే. అందుకే వామపక్షాల ఓట్లు పూర్తిగా కారు గుర్తుకు పడకుండా ఉండేందుకు బీజేపీనే గద్దర్ ను మునుగోడులో పోటీ చేయిస్తుందనే ఆరోపణలు టీఆర్ఎస్ వర్గాల నుంచి వస్తున్నాయి. కేఏ పాల్ గతంలో ఢిల్లీలో కేంద్రమంత్రులను కలిశారు, కేసీఆర్ సర్కార్ పై అవినీతీపై సీబీఐకి ఫిర్యాదు చేశారు. ఇవన్ని బీజేపీ డైరెక్షన్ లోనే సాగాయంటున్న గులాబీ నేతలు.. ఇప్పుడు మునుగోడులో గద్దర్ పోటీ కూడా కమలనాధుల కుట్రలో భాగమే అంటున్నారు. ఒకవేళ టీజేఎస్ నుంచి గద్దర్ పోటీ చేసినా అది కూడా బీజేపీ ఎత్తుగడే అంటున్నారు. తన ప్రత్యర్థి కేసీఆర్ కు షాకిచ్చేందుకు బీజేపీకి కలిసివచ్చేలా కోదండరామ్ తో ఇలా స్కెచ్ వేయించారనే వాదన వస్తోంది.

Read More : బీసీలకు తాయిలాలు కాదు … రాజ్యాధికారంలో వాటా కావాలి…

మరోవైపు మునుగోడులో గద్దర్ పోటీపై విపక్షాల వాదన మరోలా ఉంది. కాంగ్రెస్ , బీజేపీలు రెండు ప్రభుత్వ వ్యతిరేక ఓట్లపైనే ఆధారపడుతున్నాయి. కేసీఆర్ వ్యతిరేక ఓటును తమవైపు మళ్లించుకునేందుకు యత్నిస్తున్నాయి. గద్దర్ పోటీ చేస్తే మునుగోడులో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుందనే టాక్ వస్తోంది. విపక్షాల నేతలు కూడా ఇదే చెబుతున్నారు. గద్దర్ పోటీతో కేసీఆర్ వ్యతిరేక ఓటు చీలి అధికార పార్టీకే కలిసివస్తుందని బీజేపీ, కాంగ్రెస్ నేతలు అంటున్నారు. మొత్తంగా మునుగోడులో పోటీ చేస్తానన్న గద్దర్ ప్రకటన… మూడు ప్రధాన పార్టీలను పరేషాన్ చేస్తుందని తెలుస్తోంది. చూడాలి మరీ గద్దర్ తో గండం ఎవరికో…

ad 728x120 SRI swami - Crime Mirror

ఇవి కూడా చదవండి …

  1. మునుగోడు మూడు పార్టీలకూ సవాలే… సిట్టింగ్‌ సీటు నిలబెట్టుకుంటేనే కాంగ్రెస్‌కు పుట్టగతులు
  2. మునుగోడులో కమలానికి కదిలిపోతున్న యువత.
  3. కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
  4. మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
  5. మునుగోడు టీఆర్ఎస్‌లో అస‌మ్మ‌తి సెగ‌లు… సీనియ‌ర్ల‌కు స‌రైన ప్రాధాన్య‌మివ్వ‌డంలేద‌ని ఆరోప‌ణ‌లు

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.