
నల్లగొండ నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్): మడల పరిధిలోని వట్టిపల్లి గ్రామం నుండి కొడాల వెంకట్ రెడ్డి అధ్వర్యంలో యువత కమలం దారి పడుతున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా వందకు పైగా యువకులు, గ్రామ పెద్దలు వివిధ పార్టీల నుండి కమల తీర్దం పుచ్చుకున్నారు. శుక్రవారం మునుగోడులో తన నివాసం నందు వట్టిపల్లి యువతకు బిజేపి కండువా కప్పి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి యువకులను పార్టీలోకి ఆహ్వానించారు. పార్టీలోకి వచ్చిన వారిలో మామిడి రవిందర్, కమలాకర్, లెంకలపల్లి సురేష్, జిట్టగోని లింగస్వామి, సిరిసవాడ రాంబాబు, దగ్గుల గణేష్, పందుల అంజి తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …