
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : మునుగోడు ఉప ఎన్నికకు టీఆర్ఎస్ అభ్యర్థిని ఖరారు చేసింది. ముందు నుంచి అందరూ అనుకుంటున్నట్టుగానే మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని అభ్యర్థిగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మునుగోడు టికెట్ కోసం మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రభాకర్, మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ లాంటి సీనియర్ నేతలు యత్నించినప్పటికీ విస్తృత చర్చల అనంతరం కేసీఆర్ కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి వైపే మొగ్గుచూపారు.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో మునుగోడు ఉప ఎన్నిక అనివార్యమైంది. ఆయన కాంగ్రెసు వీడి బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీ నుంచి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి స్రవంతిని తమ అభ్యర్థులుగా ఆయా పార్టీ ప్రకటించారు. అధికారపార్టీ అభ్యర్థి ఎవరనేది కొంత కాలంగా సస్సెన్స్ కొనసాగుతున్నది. మొన్న దసరా రోజునే కేసీఆర్ మునుగోడు ఉప ఎన్నికకు అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకున్నా చేయలేదు. ఎట్టకేలకు సస్సెన్స్కు తెర దించుతూ కేసీఆర్ కూసుకుంట్ల పేరును ఇవాళ అధికారికంగా ప్రకటించారు. నేటి నుంచి మనుగోడు ఉప ఎన్నిక కోసం నామినేషన్ల ప్రక్రియ మొదలైంది. ఈ ఉప ఎన్నికకు నవంబర్ 3న పోలింగ్, 6వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్న సంగతి తెలిసిందే. ప్రధాన పార్టీలు అభ్యర్థులను ప్రకటించడంతో ఇక ప్రచారం ఊపందుకోనున్నది.
ఇవి కూడా చదవండి …
- బీసీలకు తాయిలాలు కాదు … రాజ్యాధికారంలో వాటా కావాలి…
- నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
- ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
- ఈడీ అరెస్ట్ భయంతో ఎంపీ సంతోష్ పరారయ్యారా? ప్రగతి భవన్ లో ఏం జరిగింది.. ?
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
2 Comments