
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా ప్రతినిధి : తెలంగాణ రాజకీయాలను మలుపు తిప్పే మునుగోడు ఉపఎన్నికలో నామినేషన్ల పర్వం మొదలైంది. తొలి రోజు ఇద్దరు నామినేషన్ వేశారు. మునుగోడులో కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు ఖరారు అయ్యారు. శుక్రవారం టీఆర్ఎస్ అభ్యర్థిని అధికారికంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రబాకర్ రెడ్డి తిరిగి పోటీ చేయనున్నారు. అయితే టీఆర్ఎస్ అభ్యర్థిని ప్రకటించడంతో కోమటిరెడ్డి క్యాంప్ లో సంతోషం వ్యక్తమవుతుందని తెలుస్తోంది. మునుగోడు టీఆర్ఎస్ పార్టీలో అసమ్మతి తీవ్రంగా ఉంది. కూసుకుంట్లకు వ్యతిరేకంగా కొంత మంది నేతలు రహస్య సమావేశాలు కూడా నిర్వహించారు. కూసుకుంట్లకు టికెట్ ఇస్తే సహకరించేది లేదని స్పష్టం చేశారు. అసమ్మతి కారణంగానే అభ్యర్థిని ప్రకటించడంలో కేసీఆర్ అలస్యం చేశారని అంటున్నారు.
Read More : మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
అటు మునుగోడు నియోజకవర్గంలో బీసీ వాదం బలంగా ఉంది. మునుగోడు 67 శాతం మంది బీసీ ఓటర్లు ఉండటంతో వర్గాల నుంచి టికెట్ డిమాండ్ వచ్చింది. కూసుకుంట్లపై అసమ్మతి ఉండటం.. కాంగ్రెస్, బీజేపీ రెడ్డీలను బరిలోకి దింపడం… మునుగోడులో బీసీ వాదం బలంగా ఉండటంతో టీఆర్ఎస్ టికెట్ విషయంలో చివరి నిమిషంలో ట్విస్ట్ జరగనుందా అన్న వార్తలు వచ్చాయి.
బీసీకి ముఖ్యమంగా మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్, మాజీ ఎమ్మెల్సీ కర్నె ప్రబాకర్ కు గులాబీ పార్టీ టికెట్ ఇస్తే తమకు ఇబ్బంది ఉంటుందని బీజేపీ టెన్షన్ పడిందని తెలుస్తోంది. కూసుకుంట్ల తమ ప్రత్యర్థిగా ఉంటేనే గెలుపు సాద్యమని కమలనాథులు బావించారట. వాళ్లు అనుకున్నట్లే కూసుకుంట్లకు గులాబీ పార్టీ టికెట్ రావడంతో బీజేపీ, కోమటిరెడ్డి క్యాంపులో సంతోషం వ్యక్తమవుతుందని చెబుతున్నారు.
కూసుకుంట్లకు టికెట్ ఇవ్వడంతో మునుగోడులో వార్ వన్ సైడ్ అంటోంది కోమటిరెడ్డి దళం.కూసుకుంట్లకు మొదటి నుంచి మద్దతుగా ఉంటున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. గత నెలన్నర రోజులుగా నియోజకవర్గంలోనే తిరుగుతున్నారు. జగదీశ్ రెడ్డి వచ్చే కూసుకుంట్లకు టికెట్ వచ్చిందనే టాక్ నడుస్తోంది. దీంతో మునుగోడులో గెలుపుతో జగదీశ్ రెడ్డికి చెక్ పెట్టాలని కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి స్కెచ్ వేశారని అంటున్నారు.
ఇవి కూడా చదవండి …
- బీసీలకు తాయిలాలు కాదు … రాజ్యాధికారంలో వాటా కావాలి…
- నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
- ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
- బీసీ అభ్యర్థిని నిలిపే పార్టీకే బడుగులు మద్దతునివ్వాలి…
5 Comments