
నల్గొండ నిఘా ప్రతినిధి(క్రైమ్ మిర్రర్): మునుగోడు నియోజకవర్గ టీఆర్ఎస్‌లో అసమ్మతి సెగలు రాజుకుంటున్నాయి. రోజుకో నేత తన అసహనాన్ని వెళ్లగక్కుతున్నారు. పార్టీ అంటే ప్రేమ ఉన్నప్పటికీ… సీనియర్ నాయకులకు సరైన ప్రాధాన్యం ఇవ్వకపోవడమే దీనికి కారణంగా తెలుస్తోంది. తమకు సరైన గౌరవం దక్కడం లేదని సభలు, ఇతరత్రా కార్యక్రమాలకు సీనియర్ నాయకులు దూరంగా ఉంటున్నట్లు వినికిడి. సీనియర్లను పక్కనబెడుతూ అవమానాలకు గురిచేస్తున్న వైఖరి పార్టీ చీలికకు, పతనానికి కారణం కావొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనకై తెగించి కొట్లాడిన నేతలకు, జూనియర్లతో అవమానాలు ఎదురవుతున్నాయని, ఈ పరిణామాలతో పార్టీ పట్ల ఆదరణ తగ్గుతోందని అంటున్నారు. యువతకు అవకాశాలు కల్పించాలన్న వాదన సరైనదే అయినప్పటికీ, సీనియర్లతో కలిసి వెళ్లాలన్న ఆలోచన చేయకపోవడం చర్చనీయాశంమవుతోంది.
ఇక విషయానికొస్తే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా అనంతరం మునుగోడు నియోజకవర్గంలో రాజకీయ పరిణామాలు నిరంతరం మారుతూ వస్తున్నాయి. ఇప్పటికే అధికార పార్టీపై అసంతృప్తితో ఉన్న ప్రజలు, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి విధానాలపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తున్నారు. టీఆర్ఎస్ సీనియర్ నాయకులకు కూడా కూసుకుంట్ల వైఖరిని తప్పుపడుతూనే ఉన్నారు. ఆయన నాయకత్వ లోపాలవల్లే మునుగోడు నియోజకవర్గ పరిధిలోని అన్ని మండలాల్లో అసంతృప్తి నేతల సంఖ్య అధికమవుతోందని అంటున్నారు.
Read More : ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మునగాల వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఇటీవల అసమ్మతి నేతల సమావేశం జరగడం మునుగోడులో చర్చకు దారితీసింది. ఈ సమావేశానికి మర్రిగూడ మండలానికి చెందిన పలువురు సీనియర్ నేతలు, మాజీ ప్రజా ప్రతినిధులు హాజరుకావడంలో పార్టీలో అలజడికి కారణమైంది. సీనియర్ నాయకులకు ప్రాధాన్యమివ్వకపోవడంపై సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.ఈ విషయాన్ని కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి దృష్టికి ఎన్నిసార్లు తీసుకెళ్లినా ఫలితం లేకపోవడంతో అసమ్మతి నేతలు ఒక్కటైనట్లు భావిస్తున్నారు.
Read More : నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
గత ఎన్నికల్లో రాజగోపాల్‌రెడ్డి గెలుపులో సీనియర్ నాయకులు మునగాల వెంకటేశ్వరరావు కీలక పాత్ర వహించారని, టీడీపీ ఇన్‌చార్జ్‌గా చేసిన అనుభవం, అపార రాజకీయ పరిజ్ఞానం ఉందని ప్రజలు భావిస్తారు. అలాంటి వ్యక్తిని ప్రస్తుతం టీఆర్ ఎస్‌లో పక్కనబెట్టడం చర్చకు దారితీసింది. కార్యకర్తలను, ప్రజలను అక్కున చేర్చుకొని, అందరితో ఆప్యాయంగా ఉండే వ్యక్తికి ప్రాధాన్యమివ్వకపోడంతో అసంతృప్తి జ్వాలలు మొదలయ్యాయి. ఈ పరిణామాలు టీఆర్ఎస్ విధ్వంసానికి దారితీసే పరిస్థితులను సృష్టించవచ్చని భావిస్తున్నారు.
Read More : దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు, గుర్తు ఏంటో తెలుసా?
అసంతృప్త నేతలంతా ఈనెల 6న నియోజకవర్గ స్థాయిలో సమావేశమై, 7వ తేదీన సీఎం కేసీఆర్‌ను కలవనున్నట్లు సమాచారం. పార్టీలో జరుగుతున్న పరిణామాలు, లోటుపాట్లను నేరుగా అధిష్టానానికే వివరించేందుకు సమాయత్తమవుతున్నారు. ఉప ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో టీఆర్ఎస్‌లో జరుగుతున్న వ్యవహారాలు పార్టీ విజయావకాశాలను దెబ్బతీయొచ్చని భావిస్తున్నారు మునుగోడు ప్రజలు.
ఇవి కూడా చదవండి …
5 Comments