
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ రాజకీయాల్లో అత్యంత కీలకంగా మారిన నల్గొండ జిల్లా మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నట్లే ఈనెల 7న ఉప ఎన్నిక నోటిఫికేషన్ రానుంది.నవంబర్ ౩న పోలింగ్ జరగనుందిఈనెల 7 నుంచి 14 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈనెల 15న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. అక్టోబర్ 17 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు. నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. షెడ్యూల్ రావడంతో మునుగోడులో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.తెలంగాణలోని మునుగోడుతో పాటు మహారాష్ట్రలోని అంధేరీ ఈస్ట్, బీహార్ లోని మెక్మా, గోపాల్ గంజ్, హర్యానాలోని అదంపూర్, ఉత్తర్ ప్రదేశ్ లోని గోల గోకర్నాథ్, ఒడిశాలోని దామ్ నగర్ అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 3న పోలింగ్ జరగనుంది.
మునుగోడులో ఇప్పటికే పార్టీలు ప్రచారం ముమ్మరం చేశాయి. కాంగ్రెస్ తన అభ్యర్థిని అధికారికంగా ప్రకటించింది. కాంగ్రెస్ నుంచి మాజీ మంత్రి పాల్వాయి స్రవంతి పోటీ చేయనున్నారు. బీజేపీ అభ్యర్థిని ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పోటీ చేయడం లాంఛనమే. అధికార టీఆర్ఎస్ పార్టీ ఇంకా మునుగోడు అభ్యర్థిని ప్రకటించలేదు. మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డికి టికెట్ ఖరారైందని ప్రచారం సాగినా.. కేసీఆర్ మాత్రం అధికారికంగా ప్రకటించలేదు. మునుగోడు నియోజకవర్గంలో అంతా తానై ప్రచారం చేస్తున్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. అయితే కూసుకుంట్లకు వ్యతిరేకంగా అసమ్మతి తీవ్రంగా ఉంది.
Read More : మునుగోడు అసమ్మతి నేతల రహస్య సమావేశం.. మంత్రి జగదీశ్ రెడ్డే టార్గెట్?
దసరా తర్వాత మునుగోడు ఉప ఎన్నిక షెడ్యూల్ వస్తుందని ప్రచారం జరగగా.. ఇప్పుడు ముందే రావడంతో మునుగోడు ఓటర్లకు పండుగే పండుగ అంటున్నారు. దసరా రోజున అన్ని పార్టీలు ఓటర్లను తాయిలాలతో ముంచెత్తేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. మందు. ముక్క సరఫరాకు సిద్దమవున్నాయి. ప్రతి ఇంటికి కిలో మటన్, మందు బాటిల్ ఇచ్చేలా టీర్ఎస్ పార్టీ ఏర్పాట్లు చేసిందని అంటున్నారు. గులాబీ పార్టీకి దీటుగా బీజేపీ కూడా తాయిలాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తుందనే ప్రచారం సాగుతోంది. అటు కాంగ్రెస్ కూడా ఓటర్ల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేసుకుంటోంది.దీంతో ఉప ఎన్నిక పుణ్యాన మునుగోడు ప్రజలకు పండుగ జజ్జనకర జాతరలా మారనుంది.
ఇవి కూడా చదవండి …
- బీసీలకు తాయిలాలు కాదు … రాజ్యాధికారంలో వాటా కావాలి…
- నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
- ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
- ఈడీ అరెస్ట్ భయంతో ఎంపీ సంతోష్ పరారయ్యారా? ప్రగతి భవన్ లో ఏం జరిగింది.. ?
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
2 Comments