
నిజాంపేట్, క్రైమ్ మిర్రర్: నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి లోని రెండవ డివిజన్ లో స్థానిక కార్పొరేటర్ చిట్ల దివాకర్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన సద్దుల బతుకమ్మ ఉత్సవాలు సోమవారం ఘనంగా నిర్వహించారు. తెలంగాణ పూల పండుగ అయిన సద్దుల బతుకమ్మను మహిళలు భక్తిశ్రద్ధలతో బతుకమ్మను ఇంటి వద్ద తయారుచేసి స్థానికంగా ఏర్పాటు చేసిన బతుకమ్మ బావి వద్ద ఆటపాటలతో ఆనందోత్సవాల మధ్య జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెరాస నాయకులు పద్మ, రష్మీ, జ్యోతి, బోట్ల సుజాత తిరుపతి, ముసుకు సిరి శ్రావణ్, బోట్ల హర్షవర్దిని, తెరాస రెండవ డివిజన్ కోశాధికారి వేణు, బీసీ సెల్ అధ్యక్షులు బొట్ల తిరుపతి, నాయకులు గణపతి, రవీందర్ రెడ్డి, శ్రవణ్ కుమార్, పెద్ద సంఖ్యలో స్థానిక మహిళలు పాల్గొన్నారు.