
క్రైమ్ మిర్రర్, ఆన్ లైన్ డెస్క్ : కూకట్ పల్లి నియోజకవర్గంలోని అల్లాపూర్ డివిజన్ లో సద్దుల బతుకమ్మను సంబురంగా జరుపుకున్నారు. వివేకానంద నగర్ లో బతుకమ్మ వేడుకలు అత్యంత వైవంగా జరిగాయి. స్థానిక చౌరస్తాలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన లైటింగ్ వెలుగుల్లో వేలాది మంది మహిళలు బతుకమ్మ ఆడుతూ సందడి చేశారు. బతుకమ్మ పాటలకు అనుగుణంగా ఆడి పాడారు. కోలాటలతో సందడి చేశారు. చిన్నారులు కూడా తమ అమ్మలతో కలిసి ఉత్సాహంగా బతుకమ్మ ఆడారు. కొందరు మహిళలు రంగురంగుల పూలతో అతిపెద్ద బతుకమ్మల తయారు చేసి తీసుకుని వచ్చారు.
అల్లాపూర్ కార్పొరేటర్ సబిహా గౌసొద్దీన్ వివేకానంద నగర్ బతుకమ్మ వేడకుల్లో పాల్గొన్నారు. ఉత్తమంగా ఎంపిక చేసిన ఐదు బతుకమ్మలను తయారు చేసిన మహిళలకు పట్టు చీరలను బహుమతిగా అందించారు. ఉత్తమంగా బతుకమ్మ ఆడిన మహిళలకు బంగారు బతుకమ్మ మెమెంటోలు అందించారు. బతుకమ్మ వేడుకలకు సహకరించిన వ్యక్తులను నిర్వాహకులు సన్మానించారు. బతుకమ్మ వేడుకల్లో అల్లాపూర్ డివిజన్ టీఆర్ఎస్ నేతలు పిల్లి తిరుపతి, వీరారెడ్డి , వివేకానంద నగర్ కాలనీ నేతలు జగన్నాథం, రవీందర్ రెడ్డి, మురళీ, రమేష్, రోశయ్య, సుదాకర్, చెల్లయ్య, మల్లేశ్ తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
- కూసుకుంట్లకు టీఆర్ఎస్ టికెట్.. సంబరాల్లో కోమటిరెడ్డి క్యాంప్!
- మునుగోడు అధికార పార్టీ అభ్యర్థిగా కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
- ఘనంగా సద్దుల బతుకమ్మ
- మునుగోడు బీసీ అభ్యర్థి ఎవరు? కేసీఆర్ ట్విస్ట్ ఇస్తారా?
- దసరాకు ముందే వచ్చిన ఉప ఎన్నిక షెడ్యూల్… మునుగోడు జనాలకు జజ్జనకర జాతరే!