
- బీసీ అభ్యర్థికే అవకాశం అంటున్న బీఎస్పీ
- బీసీ అభ్యర్థిని బరిలోకి దించే ప్రధాన పార్టీలకే మద్దతునిద్దాం
- బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్ధుల శ్రీధర్ యాదవ్
క్రైమ్ మిర్రర్, నల్గొండ ప్రతినిధి : తాయిలాలిచ్చి మునుగోడు ఉప ఎన్నికలో బీసీ ఓట్లు కొల్లగొట్టాలని ప్రధాన పార్టీలు చూస్తున్నాయని బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్ అన్నారు. తమకు కావలసింది తాయిలాలు కాదని, రాజ్యాధికారంలో వాటా అని స్పష్టం చేశారు. మునుగోడు ఉప ఎన్నికలో బీసీ అభ్యర్థిని బరిలోకి దించే తమ పార్టీలకే తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. అధికార టీఆర్ఎస్, బిజెపిలు బీసీ అభ్యర్థులకు అవకాశం కల్పించే సూచనలు లేవన్న సంకేతాలనిస్తున్నాయని గుర్తు చేశారు.
Read More : నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
ఇక ఏకంగా, ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నాయకత్వం ఆధిపత్య సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థిని ప్రకటించడం పట్ల బీసీలు అంటే వారికి ఎంత చిన్నచూపు ఉందో ఇట్టే అర్థమవుతుందని విమర్శించారు. ప్రధాన పార్టీలలో ఒక బీఎస్పీ మినహా, ఎవరు కూడా ముందుకు వచ్చి బీసీ అభ్యర్థిని బరిలోకి దించుతామని ప్రకటించలేదన్న బద్ధుల శ్రీధర్ యాదవ్, బీసీ అభ్యర్థిని బి ఎస్ పి పోటీకి పెడితే, మునుగోడు నియోజకవర్గ పరిధిలోని బీసీ ఓటర్లంతా, ఆ పార్టీకి మద్దతుగా నిలవాలని కోరారు.
Read More : ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
మునుగోడు నియోజకవర్గం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకు 12 సార్లు ఎన్నికలు జరిగితే, ఇప్పటివరకు ఒక్కసారి కూడా బీసీ నాయకుడు గెలిచి చట్టసభలలో అడుగుపెట్టిన దాఖలాలు లేవన్నారు. అందుకే ఈసారి ఉప ఎన్నికల రూపంలో వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని బీసీ అభ్యర్థిని బరిలోకి దించే పార్టీలకే బీసీ ఓటర్లంతా మద్దతునివ్వాలని ఆయన కోరారు.
ఇవి కూడా చదవండి …
- అయితే టీఆర్ఎస్.. లేదంటే కాంగ్రెస్! మునుగోడులో కంచర్ల పోటీ ఖాయమే?
- ఈడీ అరెస్ట్ భయంతో ఎంపీ సంతోష్ పరారయ్యారా? ప్రగతి భవన్ లో ఏం జరిగింది.. ?
- కారులో కలవరం… సొంత పార్టీ నేతలతోనే, రెండుగా చీలుతున్న వర్గాలు…!
- మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.
- ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దావూద్ ఇబ్రహీం కంటే డేంజరట!
2 Comments