
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణలో అత్యంత కీలకమైన మునుగోడు ఉపఎన్నిక సమరంలో రోజుకో ట్విస్ట్ నెలకొంటోంది. దసరాకి అటు ఇటుగా ఎన్నికల షెడ్యూల్ వచ్చే అవకాశం ఉండటంతో ప్రధాన పార్టీలు దూకుడు పెంచాయి. ఇతర పార్టీల నేతలకు వల వేస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీల్లోని బలమైన నేతలను ఆకర్శిస్తూనే.. గతంలో తమ పార్టీ నుంచి బయటికి వెళ్లిన నేతలను తిరిగి రప్పించే ప్రయత్నాలు చేస్తున్నాయి. దీంతో నేతల జంపింగ్ లు జోరందుకున్నాయి. ఎవరూ ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారో తెలియని పరిస్థితి. తమ గ్రామ ప్రజా ప్రతినిధి ఏ పార్టీలో ఉన్నారంటే గ్రామస్తులు చెప్పలేని దుస్తితి. మునుగోడు నియోజకవర్గంలో గంటగంటకు సమీకరణలు మారిపోతుండటంతో జనాలే ముక్కున వేలేసుకుంటున్నారు.
Read More : కారులో కలవరం… సొంత పార్టీ నేతలతోనే, రెండుగా చీలుతున్న వర్గాలు…!
ఉదయం ఒక పార్టీలో ఉన్న లీడర్.. సాయంత్రానికి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. జంప్ అయిన పార్టీలో కొనసాగుతారో లేదో కూడా క్లారిటీ ఉండటం లేదు. మరో పార్టీ నుంచి మంచి ఆఫర్ వస్తే ఏమాత్రం మొహమాటం లేకుండా కండవు మార్చేస్తున్నారు. తాజాగా గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ గులాబీ గూటికి చేరారు. గట్టుపల్ ఎంపీటీసీ భాస్కర్ 10 రోజుల క్రితమే చండూరు జడ్పీటీసీ కర్నాటి వెంకటేశంతో కలిసి టీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరారు. తిరిగి మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో కారు ఎక్కేశారు. గతంలో ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచారు. నెల రోజుల క్రితమే ప్రభుత్వం గట్టుప్పల్ ను మండలం ప్రకటించడంతో… మంత్రి సమక్షంలో అధికార పార్టీలో చేరారు. కొన్ని రోజులకే చండూరు జడ్పీటీసీతో కలిసి కాషాయ కండువా కప్పుకున్నారు. రెండు వారాలకే ఆయన మళ్లీ యూటర్న్ తీసుకున్నారు. మళ్లీ గులాబీ కండువా కప్పేసుకున్నారు.గట్టుప్పల్ ఎంపీటీసీ చెరుపల్లి భాస్కర్ నెల రోజుల్లోనే నాలుగు పార్టీల కండువాలు మార్చడం నియోజకవర్గంలో చర్చగా మారింది.
Read More : బతుకమ్మ ఆడకుండా కవితను అడ్డుకున్నారు?
మునుగోడు నియోజకవర్గంలోని మర్రిగూడ మండలంలో కమలం పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఏకంగా మండల బీజేపీ అధ్యక్షుడే జంప్ చేశారు. బీజేపీ మర్రిగూడ మండల ప్రెసిడెంట్ చెరుకు శ్రీరాములు, మండల కార్యదర్శితో పాటు సరంపేట ఉప సర్పంచ్ కొత్త మల్లయ్య మంత్రి జగదీశ్ రెడ్డి సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. నాంపల్లి మండలం మహమ్మాదాపురం ఎంపీటీసి మంజుల కారు పార్టీలో జాయిన్ అయ్యారు.సీఎం కేసీఆర్ పాలనపై ప్రజల్లో పెరుగుతున్న విశ్వసనీయత కు తాజా చేరికలు నిదర్శనమన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమం,అభివృద్ధి ని చూసే టీఆర్ఎస్ లోకి వలసల ప్రవాహం కొనసాగుతుందన్నారు.
ఇవి కూడా చదవండి …
- ఐదొందలు ఇస్తే పొట్టుపొట్టు తిట్టింది.. వెయ్యి తీసుకుని జై కొట్టింది!
- ఈడీ అరెస్ట్ భయంతో ఎంపీ సంతోష్ పరారయ్యారా? ప్రగతి భవన్ లో ఏం జరిగింది.. ?
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
- బీసీ అభ్యర్థిని నిలిపే పార్టీకే బడుగులు మద్దతునివ్వాలి…
- దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు, గుర్తు ఏంటో తెలుసా?
5 Comments