
క్రైమ్ మిర్రర్, నల్గొండ నిఘా : తెలంగాణ రాజకీయాలన్ని మునుగోడు ఉప ఎన్నిక చుట్టే తిరుగుతున్నాయి. ప్రధాన పార్టీల పోటాపోటీ వ్యూహాలతో నియోజకవర్గంలో రాజకీయ సమీకరణలు వేగంగా మారిపోతున్నాయి. రాజకీయ నేతలు రోజుకో పార్టీ కండువా కప్పేసుకుంటున్నారు. దీంతో ఏ లీడర్ ఎప్పుడు ఏ పార్టీలో ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. ఎవరూ ఎక్కువ డబ్బులు ఇస్తే ఆ పార్టీలోకి నేతలు జంప్ అవుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే లీడర్లే రోజుకో పార్టీ జంప్ చేస్తున్నారో తమకేం తక్కువ అనుకుంటున్నారో ఏమో.. ఓటర్లు కూడా పార్టీ కండువాలు మార్చేస్తున్నారు. మూడు పార్టీలకు జై కొడుతున్నారు. తాజాగా ఓ మహిళకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సీఎం కేసీఆర్ ను పొట్టు పొట్టు తిట్టిన మహిళ.. తర్వాత రోజే కండువా మార్చేసింది. గులాబీ జెండా కప్పుకుని.. కేసీఆర్ కు జై కొట్టింది.
Read More : నెల రోజుల్లో నాలుగు పార్టీలు జంప్.. మునుగోడు లీడరా నీకు సెల్యూట్!
మునుగోడు చండూరు మండలం కొండాపురం గ్రామంలో బుధవారం బతుకమ్మ చీరలను పంపిణి చేశారు. అయితే చీరలు నాసిరకంగా ఉన్నాయంటూ ఓ మహిళ వీరంగం వేసింది. సీఎం కేసీఆర్ ను పొట్టుపొట్టుగా తిట్టింది. కేసీఆర్.. ఈ చీరలే నీ కుటుంబ సభ్యులు కట్టుకుంటారా అంటూ నిలదీసింది. దరిద్రపు చీరలు ఎవరూ ఇయమన్నారంటూ మండిపడింది. కేసీఆర్ ను తిట్టిన మహిళ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More : ఈడీ అరెస్ట్ భయంతో ఎంపీ సంతోష్ పరారయ్యారా? ప్రగతి భవన్ లో ఏం జరిగింది.. ?
కేసీఆర్ ను తిట్టిన వీడియో వైరల్ కావడంతో స్థానిక టీఆర్ఎస్ నేతలు రంగంలోకి నష్ట నివారణ చర్యలకు దిగారు. ఛీరెలు పాడుగాను అంటూ పొట్టు పొట్టుగా తిట్టిన మహిళ దగ్గరకు వెళ్లి ఆమెను బుజ్జగించారు. తర్వాత ఏమైందో ఏమో .. కేసీఆర్ ను తిట్టిన ఆ మహిళ ఏకంగా మెడలో టీఆర్ఎస్ జెండా కప్పేసుకుంది. కేసీఆర్ కు జై కొట్టింది. కేసీఆర్ ప్రభుత్వం తమకు ఎంతో సాయం చేసిందని కొనియాడింది. కేసీఆర్ ను జైకొడుతూ మహిళ మాట్లాడిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Read More : దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
కొండాపురం మహిళ యూటర్న్ ఘటనపై రకరకాల చర్చలు సాగుతున్నాయి. విపక్ష పార్టీల నేతలు ఐదు వందల రూపాయలు ఇచ్చి బతుకమ్మ చీరలపై విమర్శలు చేయించారని తెలుస్తోంది. అందుకే ఆ మహిళ రెచ్చిపోయి కేసీఆర్ ను తిట్టిందని అంటున్నారు. తర్వాత అధికార పార్టీ నేతలు వెళ్లి మరిన్ని తాయిలాలు ఇయ్యడంతో ఆమె మాట మార్చిందని తెలుస్తోంది. రాజకీయ నేతలు గంటకో పార్టీ మారుతున్నప్పుడు.. ఓటర్లు మాట మారిస్తే తప్పేంటనే అభిప్రాయం నియోజకవర్గ జనాల్లో వ్యక్తమవుతోంది.
ఇవి కూడా చదవండి …
- బీసీ అభ్యర్థిని నిలిపే పార్టీకే బడుగులు మద్దతునివ్వాలి…
- దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు, గుర్తు ఏంటో తెలుసా?
- కారులో కలవరం… సొంత పార్టీ నేతలతోనే, రెండుగా చీలుతున్న వర్గాలు…!
- బతుకమ్మ ఆడకుండా కవితను అడ్డుకున్నారు?
- మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.
3 Comments