NalgondaTelangana

బీసీ అభ్యర్థిని నిలిపే పార్టీకే బడుగులు మద్దతునివ్వాలి…

మూడు ప్రధాన పార్టీలు ఒకే సామాజిక వర్గానికి పెద్ద పీట

  • బీసీ అభ్యర్థికే అవకాశం ఇస్తామంటున్న బీఎస్పీ
  • బీసీ అభ్యర్థిని నిలబెడితే బీఎస్పీకే మద్దతు ఇవ్వాలి
  • బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్

క్రైమ్ మిర్రర్, నల్గొండ జిల్లా ప్రతినిధి :  మునుగోడు నియోజకవర్గ ఉప ఎన్నికలో  బీసీ అభ్యర్థిని బరిలోకి దించే పార్టీకే బడుగు బలహీన వర్గాల ప్రజలు మద్దతు ఇవ్వాలని బీసీ రాజ్యాధికార సాధన సమితి రాష్ట్ర కన్వీనర్ బద్దుల శ్రీధర్ యాదవ్ కోరారు. అధికార టీఆర్ఎస్, బిజెపి తో పాటు, కాంగ్రెస్ పార్టీ కూడా ఆధిపత్య కులాలకు చెందిన వారికే అవకాశం ఇచ్చి, కేవలం ఒక్క సామాజిక వర్గానికే పెద్ద పీట వేయాలని చూస్తున్నాయని మండిపడ్డారు. సామాజిక సమీకరణాలను ఏమాత్రం పరిగణలోకి తీసుకోకుండా, ప్రధాన పార్టీలు చేస్తున్న ఈ మోసాన్ని బడుగు బలహీన వర్గాల ప్రజలు గమనించాలని సూచించారు.

Read More : నవంబర్ 8న మునుగోడు పోలింగ్.. దసరాకి ముందే షెడ్యూల్ ?

మునుగోడు ఉపఎన్నికలో బీసీ అభ్యర్థికే అవకాశం కల్పిస్తామని బి ఎస్ పి రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇప్పటికే ప్రకటించారని, ఒకవేళ ఎన్నికలలో బి ఎస్ పి బి సి అభ్యర్థిని రంగంలోకి దించితే, ఆ పార్టీకి బడుగు బలహీన వర్గాల ప్రజలు దన్నుగా నిలిచి తమ సత్తా చాటాలని కోరారు. బీసీలంతా ఏకమైతే మునుగోడు ఉప ఎన్నిక లో బీసీ అభ్యర్థి విజయం సాధించి చట్టసభలో అడుగుపెడతారని అన్నారు.

ad 728x120 SRI swami - Crime Mirror

ఇవి కూడా చదవండి …

  1. దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు, గుర్తు ఏంటో తెలుసా?
  2. కారులో కలవరం… సొంత పార్టీ నేతలతోనే, రెండుగా చీలుతున్న వర్గాలు…!
  3. బతుకమ్మ ఆడకుండా కవితను అడ్డుకున్నారు?
  4. మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.
  5. ఈ టీఆర్ఎస్ ఎమ్మెల్యే దావూద్ ఇబ్రహీం కంటే డేంజరట!

Show More

Crime Mirror

Crime Mirror - Telugu Daily News Paper operating from Hyderabad, Telangana.

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WP2Social Auto Publish Powered By : XYZScripts.com

Adblock Detected

We have detected ad blocker on your browser, please add it to execution or add to white list, to support us.