
- అక్రమ వసూళ్లు చేస్తూ, అజమాయిషి చేస్తున్న దామెర భీమనపల్లి ఎంపిటిసి…?
- భూతగాదాలు, స్టేషన్ బెయిల్స్ అంటూ వేలల్లో వసూల్…!
- అధికారులపై ఆరోపణలు తదుపరి బ్లాక్ మెయిల్…?
నల్గొండ జిల్లా నిఘా ప్రతినిధి (క్రైమ్ మిర్రర్) : ప్రజాస్వామ్యాన్ని అడ్డుపెట్టుకొని ఓ వ్యక్తి చేస్తున్న అవినీతి అంతా ఇంతా కాదు…! నేను ఒక అధికార పార్టీ ఎంపీటీసీని అంటూ, ఇష్టరీతిలో అక్రమ వసూలు చేస్తున్నాడంటూ మండల వ్యాప్తంగా ఆరోపణలు వినపడుతున్నాయి. భూ తగాదాలలో న్యాయం చేస్తానని, స్టేషన్ బెయిల్స్ ఇప్పిస్తానని, మా వద్ద నుండి వేలల్లో డబ్బులు తీసుకున్నాడని ఇద్దరు వ్యక్తులతో పాటు సొంత గ్రామ ప్రజలే ఆరోపిస్తున్నారు. అధికార తెరాస పార్టీలో కూడా కయ్యాలు పెట్టి రెండు వర్గాలుగా చేస్తున్నారని, విలేకరుల సమావేశంలో కార్యకర్తలు, వార్డు మెంబర్లు, సీనియర్ నాయకులు గ్రామస్థులు మండిపడ్డారు.
Read More : మంత్రి జగదీశ్ రెడ్డిపై బీసీల తిరుగుబాటు? మునుగోడులో కూసుకుంట్లకు మూడో స్థానమే!
జిల్లాలోని మర్రిగూడ మండలం దామెర భీమనపల్లిలో ఎంపిటిసి చేసే పనులపై గ్రామంలో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీ విద్యార్థి విభాగంలో బాధ్యతలు తీసుకున్న అతను ప్రభుత్వ ఉద్యోగులను సైతం బెదిరిస్తూ, బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు వసూలు చేస్తున్నాడని అనుకుంటున్నారు. మునుగోడు బై ఎలక్షన్ నేపథ్యంలో అధికార పార్టీ టిఆర్ఎస్ గెలుపుకై సర్వ ప్రయత్నాలు చేస్తుంది. కానీ ఒక పక్క ఆయా పార్టీల నుండి కొత్త నేతలను, కార్యకర్తలను, చేర్చుకుంటూ తెరాస పార్టీ నేతలు నానా తంటాలు పడుతున్నప్పటికీ ఇవేమీ లేక్క చేయకుండా, పార్టీలోనే చిచ్చు పెడుతూ, తెరాస నాయకులే వేరే పార్టీ మారేలా దురుసుగా మాట్లాడుతున్నాడని అంటున్నారు.
Read More : ప్రపంచ గుర్తింపు సాధించిన మలబార్ గోల్డ్ సంస్థ
ఈయనకు భీమనపల్లి టిఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షులు కూడా తోడవ్వటం, ఆయన ఏది చెప్పినా ఈయన ఫాలో అవ్వడం కార్యకర్తలకు సైతం నచ్చడం లేదని టాక్. ఈ ఎంపిటిసి ఆగడాలపై, అవినీతి పై మాజీ సర్పంచ్ మునగాల అంతిరెడ్డి, కార్యకర్తలు, వార్డు మెంబర్లు, మండిపడుతూ, తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. ఇంతకు ముందు కూడా శివన్నగూడెం భూ నిర్వాసితుల జోలికి వెల్లి, ఆ గ్రామాలలో కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి పర్యటించే పరిస్థితే లేకుండా చేశారని వారన్నారు. తెరాస పార్టీ నిర్ణయం మేరకు నడుచుకోకుండా ఇష్ట రీతిలో కార్యక్రమాలు చేస్తూ, గ్రామశాఖ అధ్యక్షుడితో పార్టీ నాయకులను భూతులు తిట్టిస్తూ, నయా రాజకీయం చేస్తున్నాడని అంటున్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా పార్టీనే నమ్ముకున్న మేము, ఇలాంటి తాటాకు చప్పుళ్లకు బయపడమని ఏదేమైనా పార్టీ కోసమే పని చేస్తామని తెలియజేసారు.
Read More : వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డి పోటీ చేసేది అక్కడి నుంచే?
ఈ కార్యక్రమంలో దామెర భీమనపల్లి మాజీ సర్పంచ్ మునగాల అంతిరెడ్డి, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు చాంద్ పాషా, బీరప్పలు, తెరాస గ్రామ శాఖ ప్రధాన కార్యదర్శి వనమాల మహేష్, ఉపాధ్యక్షులు రమేష్, పాల సంఘం డైరెక్టర్ బిక్షమయ్య, స్కూల్ చైర్మన్ హైమద్ పాషా, వార్డు మెంబర్లు చాంద్ పాషా, అంజాచారి, కృష్ణయ్య, తిరుమల్ రెడ్డి, మాజీ వార్డు మెంబర్లు, నడిమింటి కృష్ణయ్య, క్రియాశీల సభ్యులు, రవీందర్ రెడ్డి, శిరగోని రవి, పెంబళ్ల శేఖర్, గొడ్డెటి నర్సింహా, మారయ్య, గొరిగ రమేష్, అచ్చిని యాదయ్య, ఐతరాజు రమేష్, సత్తయ్య, కర్ణాటి నర్సింహా, సిరమోని శంకరయ్య, జహంగీర్, కర్ణాటి ఎల్లయ్య, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి …
One Comment