
క్రైమ్ మిర్రర్, తెలంగాణ బ్యూరో : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వెంటే ఉంటారు ఎంపీ సంతోష్ రావు. గులాబీ బాస్ ఎక్కడ ఉంటే ఆయన అక్కడే. ప్రగతి భవన్ లోనే ఆయన మకాం. అయితే కొన్ని రోజులుగా ఎంపీ సంతోష్ ప్రగతి భవన్ లో కనిపించడం లేదని తెలుస్తోంది. ఆయన అజ్ఞాతంలోకి వెళ్లారనే ప్రచారం సాగుతోంది.ఢిల్లీ లిక్కర్ స్కాంలో తెలంగాణ లింకులు బయటపడుతున్నాయి. ఎమ్మెల్సీ కవిత డైరెక్షన్ లోనే ఢిల్లీ లిక్కర్ స్కాం జరిగిందని ఢిల్లీ బీజేపీ ఎంపీ నేరుగానే ఆరోపించారు. తనపై వస్తున్న ఆరోపణలను కవిత ఖండించినా… ఈడీ సోదాల్లో లింకులు మాత్రమే బయటపడుతూనే ఉన్నాయి. లిక్కర్ స్కాంలో భాగంగా హైదరాబాద్ లోని వెన్నమనేని శ్రీనివాస్ రెడ్డి నివాసంలో ఈడీ సోదాలు జరిపింది. అతన్ని హైదరాబాద్ లో ప్రశ్నించింది. ఢిల్లీకి కూడా పిలిపించింది. అయితే వెన్నమనేని శ్రీనివాస్ రావు.. ఎంపీ సంతోష్ రావు బినామీ అనే ఆరోపణలు వస్తున్నాయి.
Read More : మర్రిగూడ దళిత వనబోజన కార్యక్రమంలో అవినీతి… ఎస్సి వాడలకు దూరంగా ప్రోగ్రాం.
ఢిల్లీ లిక్కర్ స్కాంలో సంతోష్ సన్నిహితులే కీలకంగా ఉన్నారన్న విషయం తెలిసిన సీఎం కేసీఆర్ సీరియస్ గా స్పందించారని తెలుస్తోంది. ఎంపీ సంతోష్ ను దారుణంగా తిట్టారని.. మనస్తాపంతో సంతోష్ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. సంతోష్ అజ్ఞాతంలోకి వెళ్లారంటూ ఓ దినపత్రిక కథనానికి సంబంధించిన క్లిప్‌ను తెలంగాణ కాంగ్రెస్ ట్విట్టర్‌లో షేర్ చేసింది ఈ వార్తలు టీఆర్ఎస్ పార్టీలోనూ కలకలం రేపాయి. ఈ వార్తలపైనే తాజాగా క్లారిటీ ఇచ్చారు ఎంపీ సంతోష్ రావు. తాను ఎక్కడికి వెళ్లలేదని, సీఎం కేసీఆర్ వెంటే ఉన్నానన్నారు.తనపై కొన్ని రోజులుగా జరగుతున్న ప్రచారం అసత్యమని చెప్పారు. తాను ఎక్కడికి పోలేదని.. హైదరాబాద్ లోనే ఉన్నానని తెలిపారు. తాను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నాన్నారు సంతోష్ రావు.
Read More : నవంబర్ 8న మునుగోడు పోలింగ్.. దసరాకి ముందే షెడ్యూల్ ?
కేసీఆర్ తనను తిట్టారంటూ కొందరు ప్రచారం చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తన నాయకుడు, తన జీవితానికి స్ఫూర్తి ప్రధాత, తన బాస్ అయిన సీఎం కేసీఆర్ సేవలోనే ఉంటానని తేల్చి చెప్పారు. తాను ప్రగతి భవన్ నుండే మాట్లాడుతున్నానని క్లారిటీ ఇచ్చారు సంతోష్ రావు. తాను ఎప్పటికి కేసీఆర్ సేవకుడిగానే ఉంటానని.. దీన్ని ఎవరూ మార్చలేరంటూ భావోద్వేగానికి గురయ్యారు ఎంపీ సంతోష్. రెండు, మూడు రోజులు బయటికి రాకుంటే అసత్య ప్రచారం చేస్తారా అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తాను మనిషిని కాదా.. తనకు ఆరోగ్య సమస్యలు ఉండవా అని నిలదీశారు. తానెప్పుడు రాజకీయ నేత అని భావించ లేదని.. కేసీఆర్ కు సేవ చేయడానికే పని చేస్తున్నానని స్పష్టం చేశారు. రాజకీయ నేతగానే భావించనప్పుడు… పార్టీ కార్యక్రమాలకు దూరమనే ప్రశ్న ఎలా వస్తుందన్నారు సంతోష్ రావు. కేసీఆర్ లేకుంటే తాను జీరో అన్నారు. కేసీఆర్ ఆదేశాలను పాటించడమే తన ఏకైక కర్తవ్యమన్నారు. ఈడీ దాడులపై ప్రశ్నించగా ఏం జరగాల్సి ఉంటే అదే జరుగుతుందని సంతోష్ రావు కామెంట్ చేశారు.
ఇవి కూడా చదవండి …
- దేశ రాజకీయాల్లోకి గ్రాండ్ ఎంట్రీ.. 80 కోట్లతో చార్టెడ్ ఫ్లైట్ కొననున్న కేసీఆర్
- బీసీ అభ్యర్థిని నిలిపే పార్టీకే బడుగులు మద్దతునివ్వాలి…
- దసరా రోజున కేసీఆర్ కొత్త పార్టీ ప్రకటన.. పార్టీ పేరు, గుర్తు ఏంటో తెలుసా?
- కారులో కలవరం… సొంత పార్టీ నేతలతోనే, రెండుగా చీలుతున్న వర్గాలు…!
- బతుకమ్మ ఆడకుండా కవితను అడ్డుకున్నారు?
2 Comments